Richest Gautam Adani: ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానానికి అదానీ.. మిగతా స్థానాలు కూడా వీరే..
గౌతమ్ అదానీ భారత్‌లో తప్ప రెండేళ్ల క్రితం ఈపేరు బయటి ప్రపంచానికి పెద్దగా తెలియదు. పెద్దగా ఉన్నత చదువులేమీ లేని ఈయన కమొడిటీ ట్రేడర్‌గా తన వ్యాపార ప్రస్థానాన్ని ప్రారంభించారు.
గౌతమ్ అదానీ భారత్‌లో తప్ప రెండేళ్ల క్రితం ఈపేరు బయటి ప్రపంచానికి పెద్దగా తెలియదు. పెద్దగా ఉన్నత చదువులేమీ లేని ఈయన కమొడిటీ ట్రేడర్‌గా తన వ్యాపార ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఇప్పుడు ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానానికి చేరి రికార్డు సృష్టించారు. ‘బ్లూమ్‌బర్గ్ కుబేరుల జాబితా’లో తొలి మూడు స్థానాల్లో చోటు దక్కించుకున్న మొదటి ఆసియా వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. అనేక ఏళ్లపాటు ఆసియా కుబేరుడిగా కొనసాగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, చైనాకు చెందిన జాక్ మా సైతం ఈ ఘనతను అందుకోలేకపోయారు. ఆగస్ట్ 29నాటికి అదానీ సంపద 137.4 బిలియన్ డాలర్లు అంటే దాదాపు 10 లక్షల 93 కోట్లు దాటింది. బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను వెనక్కి నెట్టి మూడో స్థానానికి చేరారు. ప్రస్తుతం టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్.. అదానీ కంటే ముందున్నారు. 2022లోనే అదానీ సంపద 60.9 బిలియన్ డాలర్లు చేరింది. ఫిబ్రవరిలో ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టి ఆసియా కుబేరుడిగా అదానీ నిలిచారు. ఏప్రిల్‌లో ఆయన సంపద 100 బిలియన్ డాలర్లు దాటింది. గత నెల మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను దాటేసి ప్రపంచ కుబేరుల జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకారు. అమెరికా బిలియనీర్లు బిల్ గేట్స్, వారెన్ బఫెట్ తమ సంపదలో పెద్ద ఎత్తున దాతృత్వ కార్యక్రమాలకు పంచడం కూడా అదానీ వేగంగా కుబేరుల జాబితాలో ముందుకెళ్లడానికి దోహదం చేసింది. గత రెండేళ్లలో ఓడరేవులు, విమానాశ్రయాలు, గనులు, స్వచ్ఛ ఇంధనం ఇలా పలు రంగాల్లోకి అదానీ గ్రూప్ వ్యాపార సామ్రాజ్యం విస్తరించింది. అదానీ సైతం తన 60వ జన్మదినం సందర్భంగా వివిధ సామాజిక కార్యక్రమాలకు 7.7 బిలియన్ డాలర్లు విరాళంగా ప్రకటించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos