మనిషి కోసం మరో లోకం !! ఏడేళ్లు ఆగితే చాలా ??

|

Oct 18, 2024 | 2:00 PM

భూమిపైనే కకాకుండా ఇతర గ్రహాలపై జీవించేందుకు ఉన్న అనుకూలతలు, అవకాశాలపై విస్తృత పరిశోధనలు చేస్తున్న అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మరో భారీ వ్యోమనౌకను ప్రయోగించింది. ప్రస్తుతం అంగారకుడిపై పరిశోధనలు జరుగుతుండగా ఇప్పుడు జుపిటర్ అంటే గురుగ్రహం చల్లని చంద్రుడు యూరోపా మానవ నివాస యోగ్యమేనా? అన్న విషయం తెలుసుకునేందుకు రాకెట్‌ను ప్రయోగించింది.

సోమవారం ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ఎక్స్ ఫాల్కన్ హెవీ రాకెట్‌ను ప్రయోగించింది. యూరోపాపై అపారమైన భూగర్భ సముద్రం ఉందని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలో అది మానవ మనుగడకు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. భూమిపై కాకుండా మరో గ్రహంపై సముద్రాలు ఉన్నాయా? అని తెలుసుకునేందుకు నాసా చేపట్టిన తొలి ప్రయోగం ఇదే. ఈ వ్యోమనౌక యూరోపా క్లిప్పర్ 1.8 బిలియన్ మైళ్లు ప్రయాణించి ఏప్రిల్ 2030 నాటికి జుపిటర్ కక్ష్యలోకి చేరుతుంది. ఈ రోబోటిక్ సోలార్ ఆధారిత ప్రోబ్ కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత యూరోపాపై మానవ నివాసానికి అనువైన పరిస్థితులు ఉన్నాయా? అన్న విషయాన్ని పరిశోధిస్తుంది. ఈ మిషన్ కోసం నాసా 5.2 బిలియన్ డాలర్లు.. మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 43,700 కోట్లు ఖర్చు చేసింది. కాగా, 2015లో ఈ మిషన్‌కు అనుమతి లభించగా ఇందుకోసం ఏకంగా 4 వేల మంది పనిచేశారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూ.రెండు వేల కోట్లా !! ఏంటి అంత సీన్ ఉందంటారా ??

UP నుంచి 1600km సైకిల్‌ తొక్కుకుంటూ.. బన్నీ అభిమాని డేర్ జర్నీ

టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్న రవితేజ కూతురు.. ఇక దబిడి దిబిడే !!

1000 వీసాలకు 40 వేలమంది దరఖాస్తు..

ఇది కొండా.. గుమ్మడి పండా !! సైజ్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే