Elon Musk Rocket: ఎలన్ మస్క్‌కు బిగ్‌ షాక్‌.! పేలిపోయిన సూపర్‌ హెవీ బూస్టర్ రాకెట్ ..

Updated on: Jul 15, 2022 | 8:26 PM

ఎలన్ మస్క్‌కు బిగ్‌షాక్‌ తగిలింది. సూపర్‌ హెవీ బూస్టర్ రాకెట్ జూలై 11న టెక్సాస్‌లో పరీక్షిస్తుండగా అది ఒక్కసారగా పేలిపోయింది. ఈ ఏడాది అంతరిక్షంలోని భూ కక్ష్యలో స్టార్‌షిప్‌ను


ఎలన్ మస్క్‌కు బిగ్‌షాక్‌ తగిలింది. సూపర్‌ హెవీ బూస్టర్ రాకెట్ జూలై 11న టెక్సాస్‌లో పరీక్షిస్తుండగా అది ఒక్కసారగా పేలిపోయింది. ఈ ఏడాది అంతరిక్షంలోని భూ కక్ష్యలో స్టార్‌షిప్‌ను పంపాలనే మస్క్ లక్ష్యానికి ఎదురుదెబ్బ తగిలింది. సూపర్ హెవీ బూస్టర్ 7 ప్రోటోటైప్ పేలడంతో ఎలన్‌ మస్క్‌కు తీవ్ర నష్టం వాటిల్లినట్లు ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మార్స్ గ్రహంపై మనుషుల మనుగడ సాధించడమే లక్ష్యంగా ఎలన్‌ మస్క్‌స్పేస్‌ ఎక్స్‌ బూస్టర్ రాకెట్లను తయారు చేస్తోంది. తక్కువ ఖర్చుతో స్పేస్‌లో మానవుడు అడుగుపెట్టేలా స్టార్‌ షిప్‌ స్పేస్‌ రాకెట్‌ను తయారు చేశారు. జూలై 11న దాన్ని ప్రయోగించగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీనికి సంబంధించిన దృష్యాలను నాసా స్పేస్‌ ఫ్లైట్‌ తన వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేసింది. దాంతో ఈ వీడియో వైరల్‌ అయింది.33 ఇంజిన్‌లతో తయారు చేసిన రాకెట్‌ను ఈ ఏడాది చివరి నాటికి భూకక్ష్యలోకి పంపేందుకు స్పేస్‌ ఎక్స్‌ సంస్థ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా తయారు చేసిన 394 అడుగుల సూపర్‌ హెవీ బూస్టర్‌ 7 ప్రోటో టైప్‌ను టెక్సాస్‌లో స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌ ప్రయోగాలు జరిపే బోకా చికా ప్రాంతంలో టెస్ట్‌ నిర్వహించింది. ఈ ప్రయోగం జరిపే సమయంలో స్పేస్‌ ఎక్స్‌ రాకెట్‌ బూస్టర్‌ ఒక్కసారిగా పేలి ముక్కలైంది. దీనిపై ఎలన్‌ మస్క్‌ ట్విటర్‌ ద్వారా స్పందించారు. రాకెట్‌ ఎందుకు పేలిందో స్పష్టమైన కారణం ఇంకా తెలియదు. రాకెట్‌ పేలుడు నష్టాన్ని స్పేస్‌ ఎక్స్‌ టీం అంచనా వేస్తుందని ఆయన ఈ సందర్భంగా ట్వీట్‌ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Sugarcane Plantation: పైకి చెరకు తోటే.. లోపల యవ్వారం మాములుగా లేదుగా.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్…

Eyebrow Transplant: తల వెంట్రుకలతో ఐబ్రోస్‌ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంది కానీ చివరికి.. షాక్..!

Dil Raju: బంపర్ ఆఫర్ కొట్టేసిన బడా ప్రొడ్యూసర్.. ఆ స్టార్ హీరోతో సినిమా.?

Rare Friendship: జింక పిల్లను తల్లిలా ఆదరించిన మేకలు.. పాలిచ్చి మరీ కాపాడాయి.. ఎమోషనల్ వీడియో..

Published on: Jul 15, 2022 08:26 PM