ప్రస్తుతం ఆల్కట్రాజ్ ద్వీపాన్ని అక్కడి జైలును పర్యాటక కేంద్రంగా మార్చారు. మూడు అంతస్తుల జైలు లోపలికి పర్యాటకులను అనుమతించారు. వారిని అక్కడి జైలు భారాన్ని చూసే అవకాశం కల్పించారు. చాలా కాలంగా అమెరికా హింసాత్మక నేరాలు చేసే వారి వల్ల ఇబ్బందులు పడుతోందని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. వారు దేశానికి ఎటువంటి సేవలు అందించకపోగా బాధపడుతున్నారని గతంలో ఇటువంటి అత్యంత ప్రమాదకరమైన నేరగాళ్ళను అత్యంత దూరంగా ఉండే జైళ్ళలో ఉంచినట్లు గుర్తుచేశారు. ప్రజలకు ఎటువంటి హాని చేయలేనంత దూరంలో వారిని పెట్టామని అటువంటి కఠిన శిక్షలను మళ్ళీ తేవల్సిన అవసరం ఉందని అన్నారు. అందుకే మళ్ళీ ఆ జైలును పునర్నిర్మించి తెరవాలని జైళ్ళ శాఖ, న్యాయ శాఖ, ఎఫ్బిఐ, హోంలాండ్ భద్రతా విభాగాలను ఆదేశించానని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్లో ఆదివారం సాయంత్రం రాసుకొచ్చారు.