సముద్రంలో​ ముళ్లబంతుల తొలగింపు

|

Dec 14, 2023 | 8:27 PM

వాతావరణ మార్పులు సముద్రజలాలపైనా ప్రభావం చూపిస్తున్నాయి. జీవసంబంధ మార్పులకు కారణం అవుతున్నాయి. పర్యావరణానికి మేలు చేసే కొన్ని రకాల కెల్ప్‌ అడవులు అంతరించిపోవడం వల్ల చేపలు, ఇతర జీవరాశుల మనుగడకు ముప్పుగా మారుతోంది. సముద్ర జలాల్లో కెల్ప్‌ అడవులు నాశనం కావడానికి కారణమవుతున్న పర్పుల్‌ సీ-ఆర్చిన్లను నాశనం చేస్తున్నారు అమెరికా ఉత్తర కాలిఫోర్నియాలో కొందరు డైవర్లు. ఊదారంగులో ముళ్ల బంతుల్లా గోళాకారంలో

వాతావరణ మార్పులు సముద్రజలాలపైనా ప్రభావం చూపిస్తున్నాయి. జీవసంబంధ మార్పులకు కారణం అవుతున్నాయి. పర్యావరణానికి మేలు చేసే కొన్ని రకాల కెల్ప్‌ అడవులు అంతరించిపోవడం వల్ల చేపలు, ఇతర జీవరాశుల మనుగడకు ముప్పుగా మారుతోంది. సముద్ర జలాల్లో కెల్ప్‌ అడవులు నాశనం కావడానికి కారణమవుతున్న పర్పుల్‌ సీ-ఆర్చిన్లను నాశనం చేస్తున్నారు అమెరికా ఉత్తర కాలిఫోర్నియాలో కొందరు డైవర్లు. ఊదారంగులో ముళ్ల బంతుల్లా గోళాకారంలో ఉన్న సీ-ఆర్చిన్లు విపరీతంగా పెరిగి కెల్ప్‌ అడవులు నాశనం కావడానికి కారణమవుతున్నట్లు శాస్త్రవేత్తలు ఇటీవలే గుర్తించారు. అమెరికా, కెనడా, చిలీ, ఆస్ట్రేలియా తీరప్రాంతాల్లోని పర్యావరణంలో కెల్ప్‌లది కీలకపాత్ర. వీటి జీవక్రియలు చేపలు, ఇతర జీవరాశుల పెరుగుదలకు తోడ్పడతాయి. అయితే సీ-ఆర్చిన్ల పెరుగుదలతో 2014 నుంచి 2020 వరకు కాలిఫోర్నియా తీరంలోని 96 శాతం కెల్ప్‌ అడవులు నాశనం అయినట్లు గుర్తించారు. ఫలితంగా చేపలు, నత్తలు ఇతర సముద్ర జీవులు భారీగా క్షీణించాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆన్‌లైన్‌ ఆర్డర్‌లో బయటపడ్డ మోసం.. సోనీ హెడ్‌ఫోన్స్‌ పెడితే

రెండు రూపాయలకే రుచికరమైన బిర్యానీ.. ఎక్కడంటే ??

తెలివిగా డబ్బు సంపాదించడంలో ఇదే స్టైల్

అయ్యప్పస్వామి భక్తులకు గుడ్‌ న్యూస్‌ !! స్వామి దర్శన సమయం గంట పెంపు

శ్రీశైలం పాతాళగంగ వద్ద నీటి కుక్కల సందడి