ఢిల్లీని భయపెడుతున్న వాయుకాలుష్యం వీడియో
ఢిల్లీలో దీపావళికి ముందే వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో అధికారులు జీఆర్ఏపీ స్టేజ్-1ను అమలు చేస్తున్నారు. గాలి నాణ్యత సూచీ 400 పాయింట్లు దాటుతుండడంతో ఆనంద్ విహార్ వంటి ప్రాంతాల్లో ఆందోళన పెరుగుతోంది. బాణసంచా నిషేధం, వాహన ఆంక్షలు, పరిశ్రమల నియంత్రణ వంటి కఠిన చర్యలు అమలవుతున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరోసారి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దీపావళి పండుగకు ముందే గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి పడిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 400 పాయింట్లు దాటుతుండడంతో ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ) స్టేజ్-1ను అమలు చేస్తున్నారు. ఆనంద్ విహార్‌లో గాలి నాణ్యత 384 పాయింట్లకు చేరుకోగా, 447 పాయింట్లు దాటితే అది తీవ్ర వాయు కాలుష్యంగా పరిగణిస్తారు. కాలుష్యాన్ని నియంత్రించేందుకు జీఆర్ఏపీ స్టేజ్-1 కింద పలు చర్యలు చేపడుతున్నారు. వీటిలో బాణసంచా కాల్చడంపై నిషేధం, 10-15 ఏళ్లు దాటిన డీజిల్, పెట్రోల్ వాహనాలపై ఆంక్షలు ప్రధానమైనవి. కాలుష్యం వెదజల్లే వాహనాలను సీజ్ చేయడంతో పాటు భారీ జరిమానాలు విధిస్తారు.
మరిన్ని వీడియోల కోసం :
