అమెరికన్లపై చైనీయుల మీమ్స్‌ వీడియో

Updated on: Apr 13, 2025 | 3:22 PM

ట్రంప్ టారిఫ్‌ల దెబ్బతో అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం మొదలైంది. తన హెచ్చరికలను పట్టించుకోని బీజింగ్‌పై ట్రంప్ ఏకంగా 104 శాతం టారిఫ్‌లు విధించారు. దీనిపై చైనీయులు అక్కసు వెళ్లగక్కారు. అమెరికా ప్రజలను షేమింగ్ చేస్తూ రూపొందించిన వీడియోను వైరల్ చేస్తున్నారు. ఈ ఏఐ వీడియోను టిక్‌టాక్ యూజర్ రూపొందించినట్లు తెలుస్తోంది. ఊబకాయంతో నీరసించిన అమెరికన్లు గార్మెంట్‌, చిప్ తయారీ పరిశ్రమలో పనిచేస్తున్నట్టుగా వీడియోలో ఉంది. ఆ పనిచేసీ చేసీ వారు అలసిపోయినట్లు కనిపిస్తోంది. వెనక ఒక విషాదకర సంగీతం వినిపిస్తుంది.

వీడియో చివర్లో ట్రంప్ నినాదం.. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ వ్యంగ్యంగా రాసి ఉంది. కొన్ని దశాబ్దాలుగా ఈ తయారీ రంగ ఉద్యోగాలను అమెరికా ఔట్‌సోర్సింగ్ చేసిందని, ఇప్పుడు దిగుమతులపై ట్రంప్ వేస్తోన్న టారిఫ్‌లతో ఆ ఉద్యోగాలను అమెరికన్లే చేయాల్సి ఉంటుందనే అర్థంలో దీనిని రూపొందించారు. వీడియోకు లక్షల్లో వ్యూస్‌ వచ్చాయి. అమెరికన్లు ఇలాంటి ఉద్యోగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారా..? ఒక ఎక్స్ యూజర్ డౌట్‌ పడ్డారు. ఈ మొత్తం పరిశ్రమను అమెరికన్లు ఆటోమేట్ చేస్తారనీ వారు స్వయం సమృద్ధి సాధించాలని కోరుకుంటున్నారనీ మరొకరు రాసారు. అది మంచి ప్రారంభమే అయితే దానికి వాణిజ్యం యుద్ధం అవసరం లేదనీ అభిప్రాయపడ్డారు. ఉత్పత్తి తర్వాత తమ వస్తువులు కొనుగోలు చేయాలని అమెరికా ఇతరులను బలవంతం చేస్తుందనీ అది ఊహించిందే అని ఇంకొకరు రాసుకొచ్చారు.

మరిన్ని వీడియోల కోసం

మైక్రోసాఫ్ట్‌ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..

ఫై ఓవర్‌ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్‌ బీమ్‌ ..కారులోకి చొచ్చుకెళ్లి బీభత్సం.. వీడియో

నకిలీ డాక్టర్ మాజీ స్పీకర్‌ని చంపేసాడా?వీడియో

యువతి సాహసం.. బెడిసి కొట్టడంతో ఇలా..!వీడియో