China built Village: భారత్‌పై చైనా కుట్రలు.. మరోసారి బట్టబయలు అయిన డ్రాగన్‌ కంట్రీ అరాచకాలు..(వీడియో)

Updated on: Nov 13, 2021 | 9:05 AM

డ్రాగన్ కుట్రలు మరోసారి బయటపడ్డాయి. చైనా సైన్యం హద్దు దాటి ప్రవర్తిస్తోందని మరోసారి స్పష్టమైంది. అమెరికా రక్షణశాఖ విడుదల చేసిన వార్షిక నివేదికలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాస్తవాధీన రేఖ దాటి వచ్చి అరుణాచల్ ప్రదేశ్‌లో 100 ఇళ్లతో కొత్త గ్రామాన్ని సృష్టించుకుంది చైనా.


డ్రాగన్ కుట్రలు మరోసారి బయటపడ్డాయి. చైనా సైన్యం హద్దు దాటి ప్రవర్తిస్తోందని మరోసారి స్పష్టమైంది. అమెరికా రక్షణశాఖ విడుదల చేసిన వార్షిక నివేదికలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాస్తవాధీన రేఖ దాటి వచ్చి అరుణాచల్ ప్రదేశ్‌లో 100 ఇళ్లతో కొత్త గ్రామాన్ని సృష్టించుకుంది చైనా. దీనికి సంబంధించిన నివేదికను యూఎస్‌ కాంగ్రెస్‌కు సమర్పించింది అమెరికా రక్షణ శాఖ. భారత భూ భాగంగా గుర్తించిన ప్రాంతంలోనే చైనా ఈ నిర్మాణం చేపట్టినట్లు తెలిసింది. మెక్‌మోహన్‌ రేఖ‌కు ద‌క్షిణాన భార‌త స‌రిహ‌ద్దుల్లో ఈ గ్రామం నిర్మించార‌ని బ‌య‌ట‌ప‌డింది.

2020లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, ఎల్‌ఏటీ తూర్పు సెక్టార్‌లో టిబెట్‌ అటానమస్ రీజియన్, భారత్‌లోని అరుణాచల్‌ ప్రదేశ్‌ మధ్య వివాదాస్పద భూభాగంలో 100 ఇళ్లతో ఓ గ్రామాన్ని నిర్మించింది అని ఓ నివేదిక వెల్లడించింది. ఈ గ్రామం అరుణాచల్ ప్రదేశ్‌లోని ఎగువ సుబాన్‌సిరి జిల్లాలోని సారి చు నది ఒడ్డున ఉంది. ఈ ప్రాంతం 1962 యుద్ధానికి ముందు కూడా భారతదేశం- చైనా సైనికుల మధ్య ఘర్షణలకు దారితీసింది. చైనా పదేళ్లకు పైగా ఈ ప్రాంతంలో చిన్న సైనిక స్థావరాన్ని నిర్వహిస్తోంది. అయితే భారత భూభాగంలోకి మరింత చొచ్చుకొని 2020లో అది పూర్తి స్థాయి గ్రామాన్ని నిర్మించుకుంది. అంతేకాకుండా అదే ప్రాంతంలో రహదారి నిర్మాణాలు కూడా ఏర్పాటు చేస్తోంది డ్రాగన్ దేశం.

సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించడానికి దౌత్య, సైనిక చర్చలు కొనసాగుతున్నప్పటికీ, ఎల్ఏసీ వద్ద చైనా వ్యూహాత్మక చర్యలను కొనసాగిస్తోందని వెల్లడించింది అమెరికా నివేదిక. కేవలం భారత్‌తోనే కాదు, ఇతర దేశాల తోనూ కయ్యానికి కాలు దువ్వుతోంది చైనా. ఇటీవలే తైవాన్‌ దేశంలోనికి అనుమతి లేకుండా యుద్ధ విమానాలు పంపింది డ్రాగన్ దేశం.

మరిన్ని చూడండి ఇక్కడ: Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

Ram Charan look in RRR: ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్.. సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతున్న ఫొటోస్…

Sreeleela: ఎట్రాక్ట్ చేస్తున్న అందాల చందమామ శ్రీలీల లేటెస్ట్ ఫోటోస్…

Published on: Nov 13, 2021 08:29 AM