Car Thefts: కార్లు కొట్టేయడం ఎలా..? టిక్ టాక్‌లో పెరుగుతున్న ఛాలెంజ్‌లు..

Updated on: Sep 08, 2023 | 5:55 PM

న్యూయార్క్‌లో ఇటీవల కార్ల చోరీలు బాగా పెరగడంతో ప్రజలు ఆందోళన పడుతున్నారు. టిక్‌టాక్‌ లోని ఛాలెంజ్‌లు, వీడియోలే కారణమని న్యూయార్క్‌ పోలీసులు తెలిపారు. గతంలో డబ్బు కోసం కార్లను దొంగిలించేవారు.. కానీ, ఇటీవల సోషల్‌ మీడియా ఛాలెంజ్‌లో భాగంగా చేస్తున్నారని అన్నారు. టిక్‌టాక్‌ ఛాలెంజ్‌లో భాగంగా యువత కియా, హ్యుందాయ్‌ కార్లను దొంగిలించి జాయ్‌రైడ్‌లకు వెళుతున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది.

న్యూయార్క్‌లో ఇటీవల కార్ల చోరీలు బాగా పెరగడంతో ప్రజలు ఆందోళన పడుతున్నారు. టిక్‌టాక్‌ లోని ఛాలెంజ్‌లు, వీడియోలే కారణమని న్యూయార్క్‌ పోలీసులు తెలిపారు. గతంలో డబ్బు కోసం కార్లను దొంగిలించేవారు.. కానీ, ఇటీవల సోషల్‌ మీడియా ఛాలెంజ్‌లో భాగంగా చేస్తున్నారని అన్నారు. టిక్‌టాక్‌ ఛాలెంజ్‌లో భాగంగా యువత కియా, హ్యుందాయ్‌ కార్లను దొంగిలించి జాయ్‌రైడ్‌లకు వెళుతున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఫలితంగా నగరంలో ఈ ఏడాది కార్ల దొంగతనాలు 19శాతం పెరిగాయి. ‘‘ఇటీవల కాలంలో వాహన అపహరణలు డబల్‌ డిజిట్‌లో పెరిగాయి.. దీనిని ఏమాత్రం సహించం’’ అని నగర పోలీస్‌ కమిషనర్‌ ఎడ్వర్డ్‌ కాబాన్‌ తెలిపారు. నగరంలోని ఐదు ప్రధాన ప్రాంతాల్లో ఈ ఏడాది 10,600 కారు దొంగతనాలు జరిగాయి.. గతేడాది ఈ సంఖ్య 9,000గా ఉంది. ఒక్క ఆగస్టులోనే ఇవి 25శాతం పెరిగాయి. పోలీసుల కథనం ప్రకారం టిక్‌టాక్‌లో కియా, హ్యుందాయ్‌లోని కొన్ని మోడళ్ల కార్లను ఎలా దొంగిలించాలో సవివరంగా చూపిస్తున్నారు. తాళం లేకుండా కారును ఎలా స్టార్ట్‌ చేయాలి వంటి వివరాలను అందిస్తున్నారు. నగరంలో దొంగతనానికి గురైన కార్లలో ఐదో వంతు ఈ మోడళ్లే ఉంటున్నాయి. ఈ దొంగతనాలకు పాల్పడి అరెస్టైన వారిలో సగం మంది 18 ఏళ్లలోపు యువతే ఉండటం కలకలం రేపుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..