బర్త్ డే పార్టీలో గన్ ఫైర్.. క్షణాల్లోనే నలుగురు

Updated on: Dec 02, 2025 | 7:21 PM

కాలిఫోర్నియాలోని స్టాక్ టన్ లో పుట్టినరోజు వేడుకల్లో కాల్పులు కలకలం సృష్టించాయి. దుండగుల దాడిలో నలుగురు మరణించగా, పది మందికి గాయాలయ్యాయి, వీరిలో చిన్నారులు కూడా ఉన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. దుండగుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ కాల్పులకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. కాలిఫోర్నియా రాష్ట్రంలోని స్టాక్ టన్ నగరంలో శనివారం రాత్రి కొందరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. స్థానికంగా ఉన్న ఓ బాంక్వెట్ హాల్ లో పుట్టిన రోజు వేడుకలు జరుగుతుండగా ఒక్కసారిగా చొరబడ్డ దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు శాన్ జోక్విన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో నలుగురు మరణించగా, పది మందికి బుల్లెట్ గాయాలయ్యాయని పేర్కొంది. దుండగుల కాల్పుల్లో గాయపడిన వారిలో పలువురు చిన్నారులు కూడా ఉన్నట్లు తెలిపింది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నామని, బాధితులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపిన దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని వెల్లడించారు. అయితే, ఈ కాల్పులకు కారణమేంటనేది తెలియరాలేదని, మృతులను గుర్తించాల్సి ఉందని పేర్కొన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తుని ఆస్పత్రిలో వైద్యుల నిర్వాకం.. యువకుడి కాలులో అది పెట్టేసి కుట్టేసారు..

కాఫీలు తాగారా? టిఫినీలు చేశారా? పెళ్లిలో యువతుల హడావుడి.. చివరికి

ఊరెళ్లేటప్పుడు ఇల్లే.. ఇంటికి వచ్చేసరికి కోళ్ల ఫారం అయ్యింది.. అదే కదా మ్యాజిక్కు..

హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. దీనితో మీ సామాన్లు భద్రం

ఆధార్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక ఆ పని ఇంటినుంచే చేయచ్చు