బోండీ బీచ్ హీరోకి విరాళాల వెల్లువ.. రూ.14 కోట్లు పై మాటే
సిడ్నీలోని బోండీ బీచ్ కాల్పుల్లో అహ్మద్ తెగువ చూపారు. ప్రాణాలను పణంగా పెట్టి షూటర్లను అడ్డుకుని ఐదు బుల్లెట్ గాయాలు పొందారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న అహ్మద్‌కు 43 వేల మంది దాతల నుండి $2.5 మిలియన్ల నిధులు అందాయి. ఈ సిరియన్-ఆస్ట్రేలియన్ హీరో ధైర్యాన్ని ఆస్ట్రేలియా ప్రధానితో పాటు యూదు బిలియనీర్ బిల్ ఆక్‌మాన్ కూడా కొనియాడారు.
సిడ్నీలోని బోండీ బీచ్ కాల్పుల్లో తెగువ ధైర్యం చూపిన అహ్మద్ చికిత్స తీసుకుంటున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి షూటర్లను నిలువరించిన అహ్మద్‌కు ఐదు బుల్లెట్ గాయాలు అయ్యాయి. పలు మార్లు ఆపరేషన్లు చేయాల్సి వచ్చిందని డాక్టర్లు తెలిపారు. ఎడమ భుజం వెనుక ఒక బుల్లెట్‌ను ఇంకా తీయలేదనీ అతని ఎడమ చేతిని తీయాల్సి రావచ్చని అన్నారు. అహ్మద్‌ను ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ పరామర్శించారు. అమెరికాకు చెందిన యూదు బిలియనీర్ బిల్ ఆక్‌మాన్ సిడ్నీ హీరోకు 10 వేల డాలర్ల భారీ విరాళం అందించారు. గో ఫండ్ మీ ద్వారా ఈ మొత్తాన్ని ఆక్‌మాన్ డొనేట్ చేసారు. గొ ఫండ్ మీ ప్రతినిధులు ఆసుపత్రిలో అహ్మద్‌ను కలిసి చెక్ అందజేశారు. 43 వేల మంది దాతల నుంచి 2.5 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు విరాళంగా అందాయి. భారత కరెన్సీలో ఈ మొత్తం రూ.14.84 కోట్లు. డిసెంబర్ 14న బోండి బీచ్‌లో ఉగ్రదాడి సమయంలో అహ్మద్ తన స్నేహితుడితో కలిసి కాఫీ షాప్‌లో కాఫీ తాగుతున్నారు. ఒక్కసారిగా కాల్పుల శబ్దాలు వినిపించగానే బయటికి పరుగులు తీశారు. అక్కడ మారణహోమం జరుగుతుండటాన్ని చూసి అహ్మద్ చలించారు. ఇంట్లో విషయం చెప్పమని స్నేహితుడికి చెబుతూ ఉగ్రవాదిపై దాడి చేశాడు. ప్రాణాలు పోతాయని తెలిసి కూడా తెగింపు ప్రదర్శించారు. కాల్పులు జరుపుతున్న వ్యక్తి పైకి దూకి, అతని చేతుల నుంచి తుపాకీ లాక్కున్నారు అహ్మద్. బోన్డీ బీచ్‌లో జరిగిన హనుకా కార్యక్రమంలో యూదు పౌరుల్ని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు దుండగులు. వారు తండ్రీ కొడుకులేనని ఆస్ట్రేలియా అధికారులు నిర్థారించారు. ఆస్ట్రేలియా చరిత్రలో ఈ ఉగ్రదాడి అత్యంత దారుణమైనదిగా తెలుస్తోంది. ఈ మారణహోమంలో 15 మంది మరణించారు. ఇద్దరు పిల్లల తండ్రి అయిన అహ్మద్ 2006లో సిరియా నుంచి ఆస్ట్రేలియాకు వచ్చారు. ఆస్ట్రేలియన్ పౌరసత్వం ఉన్న అతను ఫ్రూట్ షాపు నడుపుతూ జీవనం సాగిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కిడ్నాపర్లను జైలుకు పంపిన స్మార్ట్‌వాచ్.. సరిగా ఉపయోగించుకుంటే అన్ని బానే ఉంటాయి
కట్టుతప్పి వీధుల్లో పరుగులు పెట్టిన గుర్రాలు.. హడలెత్తిన జనం ఏ చేశారంటే
గోవాలో సమీరా రెడ్డి అరటి పండ్లు.. అసలు కథ ఇదే అంటున్న ముద్దుగుమ్మ