అండగా ఉంటాం.. కానీ.. మీరు దాడి చేస్తే సాయం చేయం
ఇరాన్ దాడి చేయడంతో ఇజ్రాయెల్ కు రక్షణగా నిలిచామని, డ్రోన్లు, క్షిపణులను కూల్చేయడంలో సాయం చేశామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. అయితే, ఇరాన్ పై ప్రతీకార దాడి చేస్తామంటే మాత్రం అమెరికా నుంచి ఎలాంటి సాయం అందదని ఇజ్రాయెల్ కు బైడెన్ తేల్చిచెప్పారు. ఇరాన్ దాడిలో ఇజ్రాయెల్ కు పెద్దగా నష్టం వాటిల్లలేదని గుర్తుచేస్తూ.. ప్రతీకారం అనేది అక్కరలేని అలోచన అని స్పష్టం చేశారు.
ఇరాన్ దాడి చేయడంతో ఇజ్రాయెల్ కు రక్షణగా నిలిచామని, డ్రోన్లు, క్షిపణులను కూల్చేయడంలో సాయం చేశామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. అయితే, ఇరాన్ పై ప్రతీకార దాడి చేస్తామంటే మాత్రం అమెరికా నుంచి ఎలాంటి సాయం అందదని ఇజ్రాయెల్ కు బైడెన్ తేల్చిచెప్పారు. ఇరాన్ దాడిలో ఇజ్రాయెల్ కు పెద్దగా నష్టం వాటిల్లలేదని గుర్తుచేస్తూ.. ప్రతీకారం అనేది అక్కరలేని అలోచన అని స్పష్టం చేశారు. ఈమేరకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్ లో మాట్లాడిన బైడెన్.. ఇదే విషయాన్ని నెతన్యాహుకు చెప్పినట్లు వాషింగ్టన్ వెల్లడించింది. ఇరాన్ దాడిని తిప్పికొట్టడమే ఇజ్రాయెల్ కు అతిపెద్ద విజయమని, దాదాపు 300 లకు పైగా డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించినా చెప్పుకోదగ్గ నష్టం వాటిల్లలేదని గుర్తుచేశారు. ఉద్రిక్తతలను తగ్గించడానికి ఇరుదేశాలు ప్రయత్నించాలని, సంయమనం పాటించాలని బైడెన్ కోరారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మహిళలూ జర భద్రం !! ఇవి వాడారంటే.. అంతే సంగతులు !!
బంగారు, వెండి పానీ పూరీ !! గుజరాత్ స్పెషల్ !!
సౌత్ ఇండియాకు త్వరలో బుల్లెట్ రైలు.. సర్వే మొదలవుతుందన్న ప్రధాని మోదీ
హైదరాబాద్ లో గంజాయి చాక్లెట్ల కలకలం.. ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు