ఆ దేశాలకు ఇవి తీసుకెళుతున్నారా? అయితే జైలే
విదేశాలకు వెళ్లే వారు కొన్ని వస్తువుల్ని ఇక్కడ్నుంచే తీసుకెళ్తుంటారు. ఇక మరికొందరు ఇతర దేశాల్లో బంధుమిత్రుల కోసం వస్తువుల్ని పార్శిల్ చేసి పంపుతుంటారు. ఆలోచన బాగానే ఉంది కానీ మీరు తీసుకెళ్లే వస్తువులు లేదా పంపే వస్తువులకు ఆ దేశంలో అనుమతి ఉందా? లేదా? అనేది ఒకటికి రెండుసార్లు కన్ఫమ్ చేసుకోవాలి. లేదంటే మలయాళ నటి నవ్యా నాయర్ మాదిరిగా లక్షల రూపాయల ఫైన్ కట్టాల్సి వస్తుంది.
ఇటీవలే ఓనమ్ వేడుకల కోసం ఆస్ట్రేలియా వెళ్లిన నవ్య నాయర్.. తన జడను మల్లెపూలతో అలంకరించుకుంది. మరికొన్ని మూరెల పూలను హ్యాండ్‌బ్యాగ్‌లో పెట్టుకుంది. దీంతో మెల్‌బోర్న్ విమానాశ్రయంలోనే ఆమెను ఆపారు. ఆ దేశంలో మల్లెపూలపై నిషేధం ఉంది. ఇది తెలియక లక్షా పదిహేను వేల రూపాయల జరిమానా కట్టిందీ బ్యూటీ. ఇక ఏ దేశాల్లో ఏ వస్తువుల పైన నిషేధం ఉందో ఓసారి చూసినట్లయితే.. పిల్లలు నడక నేర్చుకునే సమయంలో వాళ్లకు వాకర్ ఇస్తాం. కానీ కెనడా ప్రభుత్వం వాకర్‌ను నిషేధించింది. కారణం పిల్లలకు గాయాలు కావడమేనట! పొరపాటున కెనడా వెళ్తూ బేబీ వాకర్ తీసుకెళ్తే లక్ష డాలర్లు అంటే దాదాపు 88 లక్షల రూపాయల ఫైన్ కట్టాల్సిందే! చాలా మంది అమ్మాయిలకు ఇష్టమైన హెయిర్‌స్టైల్ పోనీ టెయిల్! కానీ ఇరాన్‌లో ఇలా ఉంటే కుదరదు. పాశ్చాత్య ఫ్యాషన్ పోకడలు తమ దేశాన్ని ప్రభావితం చేయకుండా ఉండాలన్న ఉద్దేశంతో పోనీ టెయిల్‌పై నిషేధం విధించింది ఇరాన్! ఒకవేళ ఈ నిబంధనల్ని ఉల్లంఘిస్తే అరెస్ట్ చేయడం, జుట్టు కత్తిరించడం వంటి శిక్షలు వేస్తారట! మగవారు ట్రెండీ హెయిర్‌కట్స్ ప్రయత్నించినా శిక్షలు తప్పవంటున్నారు అక్కడివారు. చూయింగ్‌గమ్ నమలడం చాలామందికి అలవాటు. కానీ సింగపూర్ ప్రభుత్వం 30 ఏళ్ల క్రితమే దీన్ని నిషేధించింది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ లో సెన్సర్లను బ్లాక్ చేయడానికి విధ్వంసకారులు చూయింగ్ గమ్ ఉపయోగించకుండా ఉండాలనే ఇలా చేసిందట. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే భారీ జరిమానాతో పాటు జైల్లో కూడా వేస్తారు. ఈ రోజుల్లో హైహీల్స్ వాడడం కామన్‌గా మారింది. కానీ హైహీల్స్ ధరించి గ్రీస్‌లో పర్యటిస్తామంటే అనుమతి లేదు. చారిత్రక, పురాతన కట్టడాలు డ్యామేజ్ అవుతున్నట్లు గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నారట! ఈ నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానా తప్పదు. బ్లూజీన్స్ మనకెంతో ఇష్టమైన అవుట్‌ఫిట్. కానీ ఉత్తరకొరియాలో మాత్రం దీన్ని ధరించడం నిషిద్ధం! పాశ్చాత్య ఫ్యాషన్ పోకడలు తమ సంస్కృతిని దెబ్బతీస్తాయన్న ఉద్దేశంతో అక్కడ బ్లూ జీన్స్ బ్యాన్ చేశారు. ఉల్లంఘిస్తే మాత్రం జైలు, జరిమానా వంటి శిక్షలు తప్పవు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బ్రెజిల్ మాజీ అధ్యక్షుడికి 27 ఏళ్ల జైలు శిక్ష.. ఎందుకంటే..
RBI NEW RULE : ఈఎంఐ కట్టకపోతే మీ ఫోన్ లాక్! ఆర్బీఐ కొత్త రూల్
Telangana Rains: కొన్నిచోట్ల క్లౌడ్ బరస్ట్ తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక
ICUలో టాలీవుడ్ ఫేమస్ కమెడియన్.. చలించిపోయిన మనోజ్.. సాయం కోసం రిక్వెస్ట్
Raghava Lawrence: పేద విద్యార్థులకు పాఠశాలగా సొంత ఇల్లు.. సేవా గుణంలో.. రారాజుగా లారెన్స్