zero Balance: అకౌంట్లో జీరో బ్యాలెన్స్‌.. ఖాతాదారులు గగ్గోలు.! వీడియో..

|

Oct 09, 2024 | 7:52 PM

బ్యాంకులో తలెత్తిన సాంకేతిక లోపంతో ఖాతాదారుల గుండె ఆగినంత పనైంది. ఉన్నట్టుండి అకౌంట్లలో జీరో బ్యాలెన్స్‌ చూపించడంతో కస్టమర్లు ఆందోళనకు గురయ్యారు. వేలాది మంది బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా ఖాతాదారులకు ఈ పరిస్థితి ఎదురైంది. బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సేవల్లో తాజాగా పెద్దఎత్తున అంతరాయం ఏర్పడింది. కస్టమర్లు తమ ఆన్‌లైన్ ఖాతాలను యాక్సెస్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

బ్యాంకులో తలెత్తిన సాంకేతిక లోపంతో ఖాతాదారుల గుండె ఆగినంత పనైంది. ఉన్నట్టుండి అకౌంట్లలో జీరో బ్యాలెన్స్‌ చూపించడంతో కస్టమర్లు ఆందోళనకు గురయ్యారు. వేలాది మంది బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా ఖాతాదారులకు ఈ పరిస్థితి ఎదురైంది. బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సేవల్లో తాజాగా పెద్దఎత్తున అంతరాయం ఏర్పడింది. కస్టమర్లు తమ ఆన్‌లైన్ ఖాతాలను యాక్సెస్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమ ఖాతాలో బ్యాలెన్స్‌ కనిపించడం లేదంటూ గగ్గోలు పెట్టారు. కొందరి అకౌంట్లలో జీరో బ్యాలెన్స్‌ కనిపించడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

సాంకేతిక అంతరాయాలను ట్రాక్ చేసే ప్లాట్‌ఫామ్ డౌన్‌డిటెక్టర్‌లో దీనికి సంబంధించిన ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అమెరికాలోని ప్రధాన నగరాల నుండి సమస్య గురించి ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. ఖాతాలు తాత్కాలికంగా అందుబాటులో లేవని కొంతమందికి, బ్యాంకింగ్ యాప్‌లోకి లాగిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ”కనెక్షన్ ఎర్రర్” అని చాలా మందికి పాప్ అప్ మెసేజ్‌ చూపించింది. బ్యాంక్ ఆఫ్ అమెరికా అంతరాయంతో ప్రభావితమైన కస్టమర్‌లు తమకు తలెత్తిన ఇబ్బందులను ‘ఎక్స్‌’ , రెడ్డిట్‌లో షేర్‌ చేశారు. బ్యాంకు యాజమాన్యంపై ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరిస్తున్నామని, ఖాతాదారులకు క్షమాపణలు చెబుతున్నామని బ్యాంక్‌ పేర్కొంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.