Bangladesh Crisis: వెంటాడి, వేటాడి రగులుతున్న బంగ్లాదేశ్.. హీరోను కూడా చంపేశారు.!

|

Aug 09, 2024 | 7:11 PM

బంగ్లాదేశ్‌ అల్లకల్లోలంగా మారింది. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేయగానే, నిరసనకారులు ఆమె మద్దతుదారులను టార్గెట్ చేశారు . ప్రముఖ సినిమా హీరో శాంతో, దర్శకుడైన అతడి తండ్రిని అతి కిరాతకంగా చంపారు. ఈ నటుడు గతంలో హసీనా తండ్రి షేక్‌ ముజిబుర్‌ రెహమాన్‌ బయోపిక్‌లో నటించాడు. ఇప్పటి వరకూ జరిగిన దాడుల్లో 20 మంది అవామీ లీగ్‌ నేతలు మృతి చెందినట్లు స్థానిక మీడియా తెలిపింది.

బంగ్లాదేశ్‌ అల్లకల్లోలంగా మారింది. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేయగానే, నిరసనకారులు ఆమె మద్దతుదారులను టార్గెట్ చేశారు . ప్రముఖ సినిమా హీరో శాంతో, దర్శకుడైన అతడి తండ్రిని అతి కిరాతకంగా చంపారు. ఈ నటుడు గతంలో హసీనా తండ్రి షేక్‌ ముజిబుర్‌ రెహమాన్‌ బయోపిక్‌లో నటించాడు. ఇప్పటి వరకూ జరిగిన దాడుల్లో 20 మంది అవామీ లీగ్‌ నేతలు మృతి చెందినట్లు స్థానిక మీడియా తెలిపింది. బంగ్లాదేశ్‌లో నిరసనలు ఇంకా చల్లారడం లేదు. ఆ దేశ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం వదలి వెళ్లారు. నిరసనకారులు మాత్రం హసీనా పార్టీ అవామీ లీగ్‌ పార్టీకి చెందిన నేతలను వేటాడి ఊచకోత కోస్తున్నారు. ఇప్పటి వరకూ జరిగిన దాడుల్లో 20 మంది అవామీ లీగ్‌ నేతలు మృతి చెందినట్లు స్థానిక మీడియా తెలిపింది.

రిజర్వేషన్ల రద్దు కోసం జరిగిన హింసాకాండలో బంగ్లాదేశ్‌లో వందల మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, తాజాగా ఈ నిరసన మాజీ ప్రధాని షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్‌ నేతలకు మృత్యుపాశంగా తయారైంది. నిరసనకారులు వారిని వెంటాడి, వేటాడి ఊచకోత కోస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ అవామీ లీగ్ నేతల మృతదేహాలు దొరుకుతున్నాయి. మూడు వారాల ఆందోళనల్లో ఇప్పటి వరకు 440 మంది ప్రాణాలు కోల్పోయారు. సోమవారం ఒక్కరోజే 109 మంది మృతి చెందినట్లు స్థానిక మీడియా తెలిపింది. బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వానికి నోబెల్‌ శాంతి పురస్కార గ్రహీత మహమ్మద్‌ యూనస్‌ నేతృత్వం వహిస్తారని అధ్యక్షుడు మొహమ్మద్‌ షహబుద్దీన్‌ మంగళవారం అర్ధరాత్రి సమయంలో ప్రకటించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.