వామ్మో… వచ్చే ఏడాది అలా జరగబోతుందా? బాంబు పేల్చిన బాబా వంగా!

Updated on: Sep 21, 2025 | 12:42 PM

బల్గేరియాకు చెందిన దివంగత జ్యోతిష్యురాలు బాబా వంగా ఏది చెబితే అది నిజం అవుతుందనే అభిప్రాయం ప్రపంచ వ్యాప్తంగా నెలకొంది. ఆమె అంచనాలు దాదాపు 90 శాతం వరకు నిజం అయ్యాయి. ఈమె చిన్నతనంలోనే తన కంటి చూపు కోల్పోయింది. 1996లో మరణించినప్పటికీ ఆమె చెప్పిన జ్యోతిష్యం మాత్రం నిజం అవుతుందనే విశ్వాసం నెలకొంది.

బాబా వంగా భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలను ముందుగానే ఊహించి చెప్పింది. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం, కరోనా వైరస్‌ 9/11 దాడులు వంటి అనేక సంఘటనలు నిజం అయ్యాయి. ఆమె అంచనా వేసిన వాటిలో ప్రకృతి వైపరిత్యాలు, భూకంపాలు, అగ్నిపర్వత విస్పోటనాలు, వాతావరణ మార్పులు వంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఆమె 2026 సంవత్సరానికి సంబంధించి చెప్పిన అనేక అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. బాబా వంగా మూడో ప్రపంచ యుద్ధం గురించి ప్రస్తావించారు. 2026లో మూడో ప్రపంచ యుద్ధం మొదలు అవుతుందని ఆమె అంచనా వేసినట్లు సమాచారం. అయితే ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల మధ్య జరుగుతున్న ఉద్రిక్తతలు, యుద్దాలు, ఘర్షణ వాతావరణం రాబోయే సంవత్సరంలో ఆమె అంచనాలు నిజం కాబోతున్నాయా అనే ఆనుమానాలకు తావిస్తోంది. 2026 సంవత్సరం AI కి ఒక మలుపు కావచ్చని బాబా వంగా చెప్పారు. యంత్రాలు మానవులకు సహాయం చేయడమే కాకుండా, ముఖ్యమైన రంగాలపై కూడా ఆధిపత్యం చెలాయించగలవు. ఇది విస్తృతమైన నిరుద్యోగం, నైతిక సందిగ్ధతలకు దారితీస్తుంది. మానవుల పాత్ర తగ్గుతోంది. 2025 లో AI వేగవంతమైన వినియోగం దృష్ట్యా బాబా వంగా హెచ్చరిక పూర్తిగా తప్పుగా అనిపించడం లేదు. ఇక గ్రహాంతరవాసులతో మొదటి పరిచయం నవంబర్ 2026 లో సంభవించవచ్చని అన్నారు. భూమి వాతావరణంలోకి ప్రవేశించే భారీ అంతరిక్ష నౌక గురించి వారు వివరించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏడాదికి రూ.20 కడితే..రూ.2 లక్షలు బెనిఫిట్

వాగులో కొట్టుకుపోతున్న యువకుడు.. పోలీసులు ఏం చేశారంటే

పాము తల కొరికి పక్కనే పెట్టుకొని నిద్రపోయిన వ్యక్తి.. తర్వాత

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఏపీలో పెరిగిన దసరా సెలవులు

Maharashtra: ఎట్టకేలకు చిక్కిన మ్యాన్‌ ఈటర్‌