అదృశ్యమైన ఈజిప్ట్ ఫారో బ్రేస్‌లెట్‌ను కరిగించేసారు వీడియో
ఈజిప్ట్ నాగరికతతో ఫారో చక్రవర్తులకు విడదీయరాని అనుబంధం ఉంది. ఫారో చక్రవర్తుల కాలంలోనే ప్రపంచ ప్రఖ్యాత గిజా పిరమిడ్‌ల నిర్మాణం జరిగింది. అద్భుతమైన పాలనతో మంచి పేరు తెచ్చుకున్న ఫారో చక్రవర్తులకు చెందిన ఒక ముంజేతి కంకణం ఇప్పుడు కనబడకుండాపోయింది. ఈజిప్ట్ రాజధాని కైరో మూజియంలో చివరిసారి ఇది కనిపించింది.
ఈ కంకణాన్ని బంగారంతో తయారుచేశారు. మ్యూజియంకు చెందిన పునరుద్ధరణ లేబొరేటరీలో ఉంచగా ఆ తర్వాత అది కనిపించకుండాపోయింది. దీనిని దొంగలించిన వ్యక్తులు విదేశాలకు అక్రమ రవాణా చేయొచ్చని ఈజిప్ట్ ప్రభుత్వం అనుమానించింది. వెంటనే దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, సరిహద్దుల వద్ద తనిఖీలు చేసింది. బ్రేస్‌లెట్ ఫొటోను ఫేస్‌బుక్, ఇన్‌స్టా గ్రామ్, వాట్సాప్‌లో షేర్ చేసింది. ఈజిప్ట్‌ను పాలించిన అమేనీమోప్ రాజుకు చెందిన కంకణంగా దీనిని గుర్తించారు. ఆ కాలంలో అత్యంత శక్తివంతమైన రాజుగా అమేనీమోప్ వెలుగొందారు. అమేనీమోప్ సమాధిని 1940లో కనుగొన్నారు. 3 వేల ఏళ్ల చరిత్ర గల ఇలాంటి కంకణం చోరీకి గురి కావడం వింతేమీ కాదు. ఉత్తర ఆఫ్రికా దేశమైన ఈజిప్ట్‌కు దశాబ్దాలుగా పురాతన వస్తువుల స్మగ్లింగ్ అనేది పెద్ద తలనొప్పిగా తయారైంది. శక్తిమేరకు కాపాడుతున్నా ప్రతి ఏటా ఎక్కడో ఓ చోట ఇలా విలువైన వస్తువులు అదృశ్యమవుతూనే ఉన్నాయి. బ్రేస్‌లెట్‌ను కరిగించే అవకాశం చాలా తక్కువ. కరిగిస్తే వచ్చే బంగారం విలువ కన్నా అలాగే కంకణం రూపంలోనే అమ్మి లెక్కలేనంత సొమ్ము సంపాదిస్తారు స్మగ్లర్లు. వీటికి బహిరంగ మార్కెట్లో చాలా విలువ ఉంది. స్మగ్లర్లు వీటిని విదేశాలకు తరలిస్తారు. అది ఎక్కడో, ఏ దేశంలోనో ప్రఖ్యాత వేలం సంస్థ వేలంపాటలోనో ఆన్‌లైన్‌లోనో ప్రత్యక్షమవుతుంది.
మరిన్ని వీడియోల కోసం :
అమెజాన్, కార్ల్స్‌బర్గ్ కార్లైల్, గోద్రేజ్, ఉబర్ ప్రతినిధులతో సమావేశం వీడియో
అంబర్‌పేట్ బతుకమ్మ కుంటకు పూర్వ వైభవం వీడియో
అంత్యక్రియలకు వెళ్లొస్తూ నలుగురు మృతి..వారి అంత్యక్రియలకు వెళ్లి మరో ముగ్గురు వీడియో
ఆగిన అంబులెన్స్.. దారిలోనే పోయిన ప్రాణం వీడియో
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

