ఆస్ట్రేలియా కీలక నిర్ణయం.. సోషల్‌ మీడియా బ్యాన్‌.. ఎందుకో తెలుసా ??

|

Sep 14, 2024 | 1:06 PM

ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లలు సోషల్‌ మీడియా వినియోగించకుండా నిషేధం విధిస్తున్నట్టు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌ మంగళవారం ప్రకటించారు. సోషల్ మీడియా, ఇతర సంబంధిత డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను యాక్సెస్ చేయడానికి కనీస వయస్సును అమలు చేయడానికి ప్రభుత్వం ఈ ఏడాది ప్రత్యేక‌ చట్టాన్ని ప్రవేశపెడుతుందని ప్రధాని పేర్కొన్నట్లు స్ధానిక వార్తా సంస్థ పేర్కొంది.

ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లలు సోషల్‌ మీడియా వినియోగించకుండా నిషేధం విధిస్తున్నట్టు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌ మంగళవారం ప్రకటించారు. సోషల్ మీడియా, ఇతర సంబంధిత డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను యాక్సెస్ చేయడానికి కనీస వయస్సును అమలు చేయడానికి ప్రభుత్వం ఈ ఏడాది ప్రత్యేక‌ చట్టాన్ని ప్రవేశపెడుతుందని ప్రధాని పేర్కొన్నట్లు స్ధానిక వార్తా సంస్థ పేర్కొంది. “సోషల్ మీడియా సామాజిక హాని కలిగిస్తోందని మాకు తెలుసు. ఇది పిల్లలను నిజమైన స్నేహితులు, నిజమైన అనుభవాల నుండి దూరం చేస్తోంది” అని ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రాల‌తో చ‌ర్చల అనంత‌రం ప్రత్యేక చట్టంపై నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయ‌న వెల్లడించారు. దీనిలో భాగంగా ముఖ్యంగా సోష‌ల్ మీడియా వినియోగానికి పిల్లల‌ కనీస వయస్సు 16 ఏళ్లుగా నిర్ణయించడమే తన అభిమతమని ఈ సంద‌ర్భంగా ప్రధాని అన్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏకాకిగా ఏక శిలా మహాగణపతి.. నిలువ నీడలేకుండా..

దుబాయ్‌ యువరాణి సంచలన పోస్ట్‌.. ఈ డైవర్స్‌ వెరీ స్పెషల్‌ అంటూ..

Follow us on