South Africa: 37 ఏళ్ళ అనకొండ .. గిన్నెస్ రికార్డుకెక్కింది.. కారణం ఏంటంటే..?? ( వీడియో )
Anakonda

South Africa: 37 ఏళ్ళ అనకొండ .. గిన్నెస్ రికార్డుకెక్కింది.. కారణం ఏంటంటే..?? ( వీడియో )

|

Jun 26, 2021 | 4:59 PM

సౌతాఫ్రికాలోని ‘ఆన్నీ’ అనే అనకొండ వయస్సు 37 ఏళ్ళు. పదిహేనేళ్ళ పాటు పెంచిన యజమాని దగ్గరా మరో 22 ఏళ్ళు జంతు సంరక్షణా కేంద్రంలోనూ ఉంది. "బందీగా'….

సౌతాఫ్రికాలోని ‘ఆన్నీ’ అనే అనకొండ వయస్సు 37 ఏళ్ళు. పదిహేనేళ్ళ పాటు పెంచిన యజమాని దగ్గరా మరో 22 ఏళ్ళు జంతు సంరక్షణా కేంద్రంలోనూ ఉంది. “బందీగా’….అంటే ఎవరైనా పెంచుకుంటున్నా..లేదా జూ ఎన్ క్లోజర్లలో ఎంతో కాలం ఉన్న పాముల కేటగిరీ కింద గిన్నెస్ రికార్డులో ఇటీవల చోటు సంపాదించుకుంది. అరుదైన ‘గౌరవం’ దక్కించుకుంది. ఈ అనకొండను పాల్ స్వైర్స్ అనే వ్యక్తి అడవి నుంచి ఇంటికి తెచ్చుకుని 15 ఏళ్ళు ఎంతో ప్రేమగా పెంచుకున్నాడు. 40 కేజీలకు పైగా బరువు, నాలుగు మీటర్ల పొడవు ఉన్న అనకొండకు ‘ఆన్నీ’ అని పేరు పెట్టాడు. అయితే ఏ కారణం వల్లో జొహాన్నెస్ బర్గ్ లోని మోంటేకేసినో బర్ద్ అండ్ రిప్టైల్‌ పార్క్ కి ఇచ్చి తాను న్యూజిలాండ్ వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఈ అనకొండ ఇక్కడే ఉంటోంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Jio Smart Phone Next: రిలయన్స్ అందిస్తున్న తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్..:. ( వీడియో )

Viral Video: మంచు వర్షంలో ఉడుత, పిచ్చుక పిక్‌నిక్… ప్రస్తుతం నెట్టింట వైరల్ వీడియో..