360 ఏళ్లుగా సజీవంగా ఉన్న మనుషులు.. అమెరికాలోనే ఎందుకిలా?

Updated on: Feb 24, 2025 | 7:07 AM

మనుషుల సగటు జీవిత కాలం ఎంత అంటే.. అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉండి, అదృష్టం ఉంటే సుమారు నూరేళ్లు బతుకుతారని చెబుతారు. కానీ మారిన జీవనశైలి కారణంగా ఏనభై ఏళ్లు బతకడమే గగనమైపోయింది. ఈ రోజుల్లో నూరేళ్లు బతికాడంటే ఆ మనిషి వార్తల్లో వ్యక్తిగా మారిపోతాడు. కానీ అగ్రరాజ్యం అమెరికాలో మాత్రం నూరేళ్లు ఏం ఖర్మ.. ఏకంగా డబుల్‌ సెంచరీ, త్రిబుల్‌ సెంచరీ బతికిన మనుషులు ఇప్పటికీ ఉన్నారట. వందల ఏళ్ల వయసున్న వ్యక్తులు ఇప్పటికీ సజీవంగా ఉన్నారట.

 వారిలో ఒక వ్యక్తి వయసు ఏకంగా 360 ఏళ్లకు పైగా ఉందట. ఇక రెండు వదందల ఏళ్ల వయసు దాటిన వారు రెండు వేల మందికి పైగానే ఉన్నారట. అమెరికా సోషల్‌ సెక్యూరిటీ డేటా విభాగం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. దీన్ని టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని ప్రభుత్వం విభాగం డోజ్‌ ధ్రువీకరించింది. ఎలాన్ మస్క్‌ ఆ విషయాన్ని ఎక్స్‌లో షేర్‌ చేయడంతో సంచలనంగా మారింది. అమెరికాలోని సోషల్‌ సెక్యూరిటీ అడ్మిన్‌స్ట్రేషన్‌.. రిటైర్మెంట్‌ తీసుకున్న వారికి, వైకల్యంతో బాధపడే వారికి ఆదాయ మార్గాలను సమకూరుస్తుంది. ఆ మేరకు రికార్డుల్లో పేర్లు నమోదు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో సోషల్‌ సెక్యూరిటీ అర్హుల జాబితాలో వందేళ్లు దాటిన దాదాపు 2 కోట్ల మంది ఇప్పటికీ సజీవంగా ఉన్నట్టుగా ఉందని, చరిత్రలోనే ఇది అతి పెద్ద మోసమని మస్క్‌ తన ట్వీట్‌లో రాశారు. వారు ఎలాంటి లబ్ధిలను స్వీకరించడంగానీ చేయడం లేదని తేల్చారు. 112 ఏళ్ల వయసు దాటిన 65 లక్షల మంది మరణించినా సెక్యూరిటీ నెంబర్లను కలిగి ఉన్నారు. ఎప్పటికప్పుడు మరణాలు నమోదు చేయకపోవడంతో ఇలా చూపిస్తుందని తేల్చారు. ఇదో పెద్ద స్కామ్‌ అంటున్నాడు మస్క్‌.