Running Car: రన్నింగ్‌ కారు టైర్‌నే మార్చేశారు.. అది ఎలాగో చూడండి.! గిన్నిస్ రికార్డు..

|

Jul 27, 2022 | 9:46 AM

ఎవరూ చెయ్యలేనిది చేస్తే... ఆ కిక్కే వేరు కదా. అందులోనూ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ నమోదైతే... ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. ఇప్పుడు అలాంటి ఓ వెరైటీ ఫీటే చేసి,


ఎవరూ చెయ్యలేనిది చేస్తే… ఆ కిక్కే వేరు కదా. అందులోనూ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ నమోదైతే… ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. ఇప్పుడు అలాంటి ఓ వెరైటీ ఫీటే చేసి, గిన్నిస్‌ రికార్డు సృష్టించారు ఇద్దరు ఇటాలియన్లు. ఇటలీలో జరిగిన గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు షోలో ఇద్దరు ఇటాలియన్‌ వ్యక్తులు కదులుతున్న వాహనంలో ఉండే టైరు మార్చి రికార్డు సృష్టించారు. అయితే ఇక్కడ ఇంకో విచిత్రం ఏమిటంటే.. ఆ కారు ఒక సైడ్‌కు బెండ్‌ అయిన సమయంలోనే ఈ ఫీట్‌ చేశారు. ముందుగా ఓ కారులు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అందులోకి ఓ వ్యక్తి కారు ఎత్తైన రార్డ్‌పైకి పోనిచ్చి, కారును మొత్తాన్ని వన్‌సైడ్‌కు బెండ్‌ చేశాడు. అలా బెండైన వెంటనే మరో వ్యక్తి ఆ కారు కిటికిలో నుంచి బయటకు వచ్చి, కారు ముందు బ్యానెట్‌పై పడుకుని టైర్‌ను ఇప్పేసి, స్టెపినీగా ఉన్న మరో టైర్‌ను అమర్చాడు. అదీ కూడా కేవలం ఒక నిమిషం 17 సెకన్ల వ్యవధిలో మార్చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jathiratnam: ఓరి బుడ్డోడా.. బ్యాక్ బెంచ్ స్టూడెంట్‌ అనిపించినావ్‌గా.. అసలైన జాతిరత్నం..

Bus Shelter – Buffalo: బస్‌ షెల్టర్‌ ఓపెనింగ్‌కు ముఖ్య అతిథిగా గేదె.. దెబ్బకు దిగొచ్చిన అధికారులు..

Published on: Jul 27, 2022 09:46 AM