Crime: అమెరికాలో దారుణం.. ఐదుగురిని కాల్చిచంపిన 50 ఏళ్ల వ్యక్తి..

|

Jul 01, 2024 | 11:26 AM

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. సోమవారం రాత్రి జరిగిన వరుస కాల్పుల్లో ఐదుగురు మృత్యువాతపడ్డారు. లాస్ వెగాస్‌కు సమీపంలో జరిగిన కాల్పుల్లో ఓ 13 ఏళ్ల బాలిక తీవ్రంగా గాయపడింది. 57 ఏళ్ల ఎరిక్ ఆడమ్స్‌ అనే నిందితుడు ఈ కాల్పులకు పాల్పడ్డాడని నార్త్ లాస్ వెగాస్ పోలీస్ డిపార్ట్‌మెంట్ అధికారులు గుర్తించారు. అయితే కాల్పుల అనంతరం నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు వివరించారు.

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. సోమవారం రాత్రి జరిగిన వరుస కాల్పుల్లో ఐదుగురు మృత్యువాతపడ్డారు. లాస్ వెగాస్‌కు సమీపంలో జరిగిన కాల్పుల్లో ఓ 13 ఏళ్ల బాలిక తీవ్రంగా గాయపడింది. 57 ఏళ్ల ఎరిక్ ఆడమ్స్‌ అనే నిందితుడు ఈ కాల్పులకు పాల్పడ్డాడని నార్త్ లాస్ వెగాస్ పోలీస్ డిపార్ట్‌మెంట్ అధికారులు గుర్తించారు. అయితే కాల్పుల అనంతరం నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు వివరించారు. నార్త్ లాస్ వెగాస్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో సోమవారం పొద్దుపోయాక కాల్పులు జరిగినట్లు సమాచారం రావడంతో వెంటనే అక్కడికి చేరుకున్నామని అధికారులు వివరించారు. ఇద్దరు మహిళల మృతదేహాలను గుర్తించామని, ఒకరి వయసు 40 ఏళ్లు, మరొకరి వయసు 50 ఏళ్లు అని పేర్కొన్నారు. అదే అపార్ట్‌మెంట్‌లో తీవ్రంగా గాయపడిన 13 ఏళ్ల బాలికను కూడా గుర్తించి హాస్పిటల్‌కు తరలించామని చెప్పారు. ఈ అపార్ట్‌మెంట్‌కు సమీపంలోనే మరికొంత మంది బాధితులకు సంబంధించిన సమాచారం అందిందని చెప్పారు. దర్యాప్తు చేస్తుండగా మరో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడి మృతదేహాలను గుర్తించామని చెప్పారు. మృతులంతా తుపాకీ గాయాలతో చనిపోయారని లాస్ వెగాస్ పోలీసులు వివరించారు. కాగా నిందితుడు ఆడమ్స్ కోసం పోలీసులు రాత్రిపూట వేట కొనసాగించారు. కచ్చితమైన సమాచారం ఉండడంతో అక్కడికి వెళ్లి లొంగిపోవాలని కోరారు. అయితే పోలీసులు సమీపిస్తున్న సమయంలో తుపాకీతో తనను తాను కాల్చుకొని చనిపోయాడని పోలీసు అధికారులు వివరించారు. ఈ కాల్పులకు కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఆడమ్స్ బంధువులను సంప్రదించేందుకు ప్రయత్నించగా ఎవరూ అందుబాటులోకి రాలేదని పేర్కొన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.