హాట్ టాపిక్‌గా డొనాల్డ్ ట్రంప్ 12 అడుగుల విగ్రహం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 12 అడుగుల బంగారు విగ్రహం ఆవిష్కరణ సంచలనంగా మారింది. క్యాపిటల్ భవనం ఎదురుగా ట్రంప్ బంగారు విగ్రహం ఏర్పాటు చేశారు. చేతిలో బిట్‌కాయిన్‌తో ఉన్న విగ్రహం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గింపు నేపథ్యంలో.. ట్రంప్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు క్రిప్టోకరెన్సీ పెట్టుబడిదారులు.
డిజిటల్ కరెన్సీ, ద్రవ్య విధానం, ఆర్థిక మార్కెట్లలో ప్రభుత్వ పాత్రపై చర్చను రేకెత్తించడమే ఈ విగ్రహం ఉద్దేశం అని దీనిని ఏర్పాటు చేసిన నిర్వాహకులు చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. డిజిటల్ కరెన్సీ భవిష్యత్తు, ద్రవ్య విధానం, ఆర్థిక మార్కెట్‌లో ఫెడరల్ ప్రభుత్వ విధానాల గురించి చర్చించుకునేలా చేసేందుకే దీన్ని ఏర్పాటు చేశామని నిర్వాహకులు చెప్పినట్లు తెలుస్తోంది. ట్రంప్ క్రిప్టో అనుకూల విధానాలకు ఇది నివాళి అని నిర్వాహకులు తెలిపారు. ట్రంప్ తరచుగా ఫెడరల్ రిజర్వ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించేవారు. మరోవైపు ట్రంప్ విగ్రహావిష్కరణ ప్రజలు, ప్రతిపక్షాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అంతేకాకుండా ఈ ఘటన జరిగిన సమయంలోనే ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను తగ్గించనున్నట్లు ప్రకటించింది. ఏడాది తర్వాత వడ్డీ రేట్లను తగ్గించడం ఇదే తొలిసారి. ఈ రెండు సంఘటనలు ఒకే సమయంలో జరగడం ఆసక్తికరంగా మారింది. అమెరికాలో ఓవైపు ద్రవ్యోల్బణం పెరుగుతుంటే మరోవైపు ఉద్యోగాల సృష్టి రేటు కూడా నెమ్మదిస్తోందని ఫెడరల్ రిజర్వ్ పేర్కొంది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఎలా స్పందిస్తారన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
18 నిమిషాలు.. సముద్రంపై చక్కర్లు కొట్టిన విమానం.. కారణం ఇదే
వెంటాడిన భయం.. దానితో ఇద్దరు మృతి..
జస్ట్ మిస్.. తృటిలో తప్పించుకున్న బీజేపీ ఎంపీ
సీఎం చెప్పారు.. బుల్లెట్ దిగింది! హీరోయిన్‌కి యోగి మార్క్ న్యాయం