బర్న్ అవుట్ బాధితులుగా మిలీనియల్స్.. కారణమిదే
బర్న్ అవుట్ అనేది దీర్ఘకాలిక ఒత్తిడివల్ల వచ్చే మానసిక, శారీరక, భావోద్వేగ అలసట. ఇది ఉద్యోగం లేదా బాధ్యతల పట్ల ఆసక్తి కోల్పోవడానికి దారితీస్తుంది. అసంతృప్తికి, నిస్సహాయతకు కారణం అవుతుంది. అధిక పని భారం, వర్క్- లైఫ్ సమతుల్యత లేకపోవడం, నిరంతర ఒత్తిడి, విశ్రాంతి లేకపోవడం, ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ వల్ల burnout వస్తుంది.
దీనిని మేనేజ్ చేయలేక మిలీనియల్స్ 1981-1996 మధ్య జన్మించిన 29 నుంచి 44 ఏళ్ల మధ్య వారు బర్న్ అవుట్‌తో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు సర్వే పేర్కొంది. కష్టాలు బాధ్యతలూ ప్రతి ఒక్కరికీ ఉంటాయి. సమస్యలూ సవాళ్లూ ప్రతి ఒక్కరికీ ఎదురవుతుంటాయి. రోజువారీ జీవితంలో, ఉద్యోగాలు చేసే విధానంతో పోల్చినప్పుడు జెన్‌జీలకంటే మిలీనియల్స్ ఎక్కువ సఫర్ అవుతున్నారని, వీరు తరచుగా బర్న్ అవుట్ బాధితులుగా మారుతున్నారని ఓ సర్వే బయటపెట్టింది. ముఖ్యంగా జెన్‌జీలు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి ఆలోచిస్తున్నారట. బర్న్ అవుట్‌కు గురయ్యే పరిస్థితి ఉంటే.. ఎన్ని కోట్ల ఆదాయం వచ్చే ఉద్యోగాన్నైనా సరే వదిలేస్తున్నారట. అధిక ఒత్తిడిని అనుభవిస్తూ, ఇబ్బంది పడుతూ పనిచేసేందుకు వారు సిద్ధ పడటం లేదు. మిలీనియల్స్ అండ్ జెన్‌జీల మధ్య ఈ రెండు తేడాలే వారి జీవితాలను ప్రభావితం చేస్తున్నాయని నిపుణులు అంటున్నారు. జెన్‌జీలు మానసిక ఆరోగ్యం, వ్యక్తిగత సంతోషాన్ని కాపాడుకోవడంపై దృష్టి పెడుతూ, ఒత్తిడిని నివారించేందుకు మరింత స్మార్ట్ విధానాలను అనుసరిస్తున్నారట. ఈ సర్వే ప్రకారం.. దాదాపు 50% మంది మిలీనియల్స్ ఇటీవల బర్న్ అవుట్ కారణంగా ఉద్యోగాలు వదిలేసారు. 84% మంది తాము చేస్తున్న ప్రస్తుత ఉద్యోగంలో అలసటను అనుభవిస్తున్నారు. వీరు ఎక్కువ గంటలు పని చేస్తూ, కష్టతరమైన బాధ్యతలను నిర్వహిస్తూ అధిక ఒత్తిడిని ఫీలవుతున్నారు. కెరీర్‌లో ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. కానీ ఈ అధిక శ్రమ మానసికంగా, శారీరకంగా అలసిపోయేలా చేస్తుందని సర్వేలో తెలిసింది. జెన్ జీలు మాత్రం ఇందుకు భిన్నం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
8 బతికిన కప్పల్ని మింగేసిన మహిళ.. కారణం తెలిస్తే షాకవుతారు
శోభితతో నా పరిచయం అక్కడే… వైరల్‌గా చైతూ కామెంట్స్
శతాయువు కోసం జపనీయుల పంచతంత్రం
UPI payments: ఇక.. ఫేస్, ఫింగర్‌ప్రింట్‌తోనే UPI చెల్లింపులు
