Cyclone to AP: ఏపీకి తుపాను ముప్పు.? బంగాళాఖాతంలో అల్పపీడనం..
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి జోరుగా వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. శనివారం నాటికి దక్షిణ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడి తీవ్ర వాయుగుండంగా, అది బలపడి తుపానుగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేశారు. ఉపరితల ఆవర్తనం నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారేందుకు అవకాశం ఉందని, ఈ నెల 13 నుంచి 15 మధ్య వాయుగుండంగా రూపాంతరం చెందవచ్చని,
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి జోరుగా వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. శనివారం నాటికి దక్షిణ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడి తీవ్ర వాయుగుండంగా, అది బలపడి తుపానుగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేశారు. ఉపరితల ఆవర్తనం నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారేందుకు అవకాశం ఉందని, ఈ నెల 13 నుంచి 15 మధ్య వాయుగుండంగా రూపాంతరం చెందవచ్చని, ఈ నెల 17 నాటికి ఏపీలోనే తీరం దాటవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
వాయుగుండం ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ అధికారులు తెలిపారు. ఒకవేళ వాయుగుండం కాస్తా తుపానుగా బలపడితే ఏపీ దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు మధ్యలో తీరం దాటవచ్చని, అయితే అల్పపీడనం ఏర్పడిన తర్వాతే తుపానుపై మరింత స్పష్టత వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయని వాతావరణ విభాగం నిపుణులు చెబుతున్నారు. మరోవైపు పల్నాడు, శ్రీ సత్యసాయి, ఏలూరు, ప్రకాశం, పశ్చిమగోదావరితో పాటు పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది.
మరోవైపు తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. డెల్టాప్రాంతంలో 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. చెన్నై, పుదుచ్చేరి సహా ఆరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాలతో పుదుచ్చేరిలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. స్థానిక ప్రభుత్వాస్పత్రి సైతం జలదిగ్బంధంలో చిక్కుకుంది. దాంతో పేషంట్లను మరో ఆస్పత్రికి తరలించారు అధికారులు. చెన్నై, పుదుచ్చేరి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సేలం జిల్లాలలోని సబ్‌వే వరదనీటితో నిండిపోయింది. వరదనీటిని తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.