Shocking Video: సికింద్రాబాద్‌లో బైక్‌ నడిపిన ఇద్దరు మైనర్ పిల్లలు.. రెప్పపాటులో ఘోరం! వీడియో

Updated on: Oct 02, 2025 | 4:06 PM

Minor boy died after falling under a van wheel in Secunderabad: ఓ మైనర్ పిల్లడి డ్రైవింగ్ ముచ్చట ఓ మైనర్ బాలుడి ప్రాణలు తీసింది. ఎంజీ రోడ్డులో ఇద్దరు మైనర్ బాలుళ్ళు బైక్ పై వెళుతుండగా.. వెనుక నుంచి వచ్చిన డీసీఏం వ్యాన్ వారిని బలంగా ఢీ కోట్టింది. దీంతో బైక్ పై ఉన్న ఇద్దరు మైనర్ బాలురుల్లో, బైక్ వెనుక కుర్చున్న..

హైదరాబాద్, అక్టోబర్‌ 2: సికింద్రాబాద్‌లో ఓ మైనర్ పిల్లడి డ్రైవింగ్ మరో మైనర్ బాలుడి ప్రాణలు తీసింది. ఎంజీ రోడ్డులో ఇద్దరు మైనర్ బాలుళ్ళు బైక్ పై వెళుతుండగా.. వెనుక నుంచి వచ్చిన డీసీఏం వ్యాన్ వారిని బలంగా ఢీ కోట్టింది. దీంతో బైక్ పై ఉన్న ఇద్దరు మైనర్ బాలురుల్లో, బైక్ వెనుక కుర్చున్న రసుల్ పురకు చెందిన సయ్యద్ వ్యాన్ టైర్ కింద పడి అక్కడికక్కడే ప్రాణలు కోల్పోయాడు. ఇక బైక్ నడిపిన బాలుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న రాంగోపాలపేట పోలీసులు వ్యాన్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకోని పోలీస్టేషన్ కు తరలించారు.

ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాలుడి మృతదేహన్ని పోలీసులు గాంధీ ఆసుపత్రి మార్చురికి తరలించారు. బంధువుల కు టీఫిన్ ఇచ్చేందుకు బాలుడు బైక్ తీసుకోని వెళ్లినట్లుగా సమాచారం. మృతుడు రసుల్ పురకు చెందిన సయ్యద్ గా పోలీసులు గుర్తించారు. పిల్లలు తెలిసీ తెలియని తనంతో రద్దీగా ఉన్న రోడ్డుపై బైక్ నడిపి ఘోర ప్రమాదానికి కారణమయ్యారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Published on: Oct 02, 2025 04:05 PM