Andhra: పొట్ట ఉబ్బిపోయి కనిపించిన నల్లతాచు.. కక్కించింది చూడగా.. వామ్మో.!
సాధారణంగా నల్లతాచును దూరం నుంచి చూస్తేనే దడుసుకుంటాం. అలాంటిది అది మనకు దగ్గరలో.. అదీనూ కోళ్లను మింగేసి కదలలేని పరిస్థితిలో కనిపిస్తే.. ఇంకేమైనా ఉందా.? గుండె ఆగినంత పనవుతుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఈ వార్త మీరూ చూసేయండి మరి.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నల్లత్రాచు స్థానికులను హడలెత్తించింది. అమలాపురం రూరల్ మండలం జనిపల్లిలోని మారిశెట్టి నాగభూషణం అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించిన ఆరడుగుల నల్లత్రాచు.. అక్కడే ఉన్న కోళ్ల పెట్టెలో ఉన్న నాలుగు కోళ్లను మింగి కదలలేని స్థితిలో కనిపించింది. భయంతో వణికిపోయిన సదరు వ్యక్తి.. వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించాడు. విషయం అందుకున్న వెంటనే స్నేక్ క్యాచర్ గణేష్ వర్మ.. చాకచక్యం పామును పట్టుకుని.. అది మింగేసిన నాలుగు కోళ్లను కక్కించి.. ఆ తర్వాత డబ్బాలో బంధించాడు. ఆపై సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టాడు. దీంతో అక్కడున్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు. వర్షాకాలం కావడంతో నివాస ప్రాంతాల్లోకి ఇలా పాములు రావడం సర్వసాధారణమని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్నేక్ క్యాచర్ సూచించాడు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Published on: Jul 22, 2025 11:32 AM