తప్పించుకున్న 25 కోట్ల తేనెటీగలు ! ఏం జరిగిందంటే వీడియో
అమెరికాలో ఏకంగా 25 కోట్ల తేనెటీగలు తప్పించుకున్నాయి. అసలు ఏం జరిగిందంటే వాషింగ్టన్ రాష్ట్రంలో 30 వేల కిలోల తేనె తుట్టలతో వెళుతున్న వాహనం బోల్తా పడింది. దాంతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 25 కోట్ల తేనెటీగలు తప్పించుకున్నాయి. కెనడా సరిహద్దు ప్రాంతం లాండన్లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. ఓ మూల మలుపు వద్ద బండి వేగాన్ని డ్రైవర్ నియంత్రించలేకపోవడంతో ట్రక్ బోల్తా పడింది.
తేనె తుట్టలన్నీ చెల్లాచెదురుగా పడిపోవడంతో తేనెటీగలు తప్పించుకున్నాయి. విషయం తెలియగానే పోలీసులు తేనెటీగల నిపుణులతో వెంటనే అక్కడికి చేరుకున్నారు. అంతా కలిసి తేనె తుట్టలను ఒక్క చోటికి చేర్చారు. తప్పించుకున్న తేనెటీగల కోసం ఎదురుచూస్తూ గడుపుతున్నారు. అవి తప్పకుండా తుట్టల దగ్గరికి తిరిగి వస్తాయని బీ కీపర్స్ చెబుతున్నారు. తేనెటీగలు రాణి తేనెటీగను విడిచి ఉండలేవని దాన్ని తీసుకొని రెండు మూడు రోజుల్లో వచ్చేస్తాయని అంటున్నారు. రెండు మూడు రోజుల పాటు పరిసర ప్రాంతాలకు రావద్దని స్థానికులను పోలీసులు హెచ్చరించారు. అమెరికాలో లక్షలాది తేనెటీగలను తరచు ఇలా ఒక చోటు నుంచి మరో చోటికి తరలిస్తుంటారు. వ్యవసాయంలో తేనెటీగలది ముఖ్య పాత్ర. పరాగ సంపర్కానికి పంటలు పండడానికి సాయపడతాయి. ప్రపంచవ్యాప్తంగా తేనెటీగల సంఖ్య భారీగా తగ్గిపోతూ ఉండటంతో ప్రతి ఏడాది మే 20వ తేదీన ప్రపంచ తేనెటీగల దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకోవాలని ఐక్యరాజ్యసమితి 2018లో పిలుపునిచ్చింది.
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

