AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ర్యాగింగ్ కలకలం.. సీనియర్ల రాక్షసానందం.. ఏం చేశారంటే

ర్యాగింగ్ కలకలం.. సీనియర్ల రాక్షసానందం.. ఏం చేశారంటే

Phani CH
|

Updated on: Apr 11, 2026 | 6:05 PM

Share

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో సీనియర్ల ర్యాగింగ్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. వాట్సాప్ చాటింగ్ కారణంగా జూనియర్లను అర్ధనగ్నంగా మార్చి వేధించిన ఏడుగురు సీనియర్లను కళాశాల ఏడాది పాటు సస్పెండ్ చేయగా, హాస్టల్ నుండి శాశ్వతంగా బహిష్కరించింది. పోలీసులు యాంటీ ర్యాగింగ్ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సర్వత్రా డిమాండ్ వినిపిస్తోంది.

విద్యార్థులకు ప్రాణం పోయడం నేర్పించాల్సిన వైద్య కళాశాలలో మళ్ళీ ర్యాగింగ్ భూతం పడగ విప్పింది. గతంలో డాక్టర్ ప్రీతి ఘటన మరువక ముందే, వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ లో సీనియర్లు హద్దులు దాటారు. జూనియర్ల పట్ల అమానుషంగా ప్రవర్తించి, వారిని అర్ధనగ్నంగా మార్చి వేధించిన ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ ఘాతుకానికి అసలు కారణం ఒక వాట్సాప్ చాటింగ్. ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న కొంతమంది జూనియర్లు, తమ వాట్సాప్ గ్రూపులో థర్డ్ ఇయర్ సీనియర్ల గురించి అసభ్యంగా చర్చించుకున్నారన్నది సీనియర్ల ఆరోపణ. దీనిపై కక్ష పెంచుకున్న ఏడుగురు సీనియర్ విద్యార్థులు, గత నెల 29వ తేదీ రాత్రి తమ ప్రతాపం చూపించారు. సుమారు 20 మంది జూనియర్లను హాస్టల్ బిల్డింగ్ పైకి తీసుకెళ్లిన సీనియర్లు, వారితో అమానుషంగా ప్రవర్తించారు. జూనియర్ల బట్టలు విప్పించి, అర్ధనగ్నంగా గోడకుర్చి వేయించి రాక్షసానందం పొందారు. ఈ అవమానాన్ని భరించలేకపోయిన జూనియర్ విద్యార్థులు ధైర్యం చేసి యాంటీ ర్యాగింగ్ హెల్ప్ లైన్, NMCకి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు అందిన వెంటనే రంగంలోకి దిగిన కళాశాల ఇంటర్నల్ కమిటీ విచారణ చేపట్టింది. విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో, ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యారాణి కఠిన నిర్ణయం తీసుకున్నారు. ర్యాగింగ్‌కు పాల్పడిన ఏడుగురు సీనియర్లను ఏడాది పాటు కళాశాల నుండి సస్పెండ్ చేశారు. వారిని కళాశాల హాస్టల్ నుండి శాశ్వతంగా బహిష్కరించారు. ప్రిన్సిపాల్ ఫిర్యాదు మేరకు మట్టేవాడ పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులపై యాంటీ ర్యాగింగ్ చట్టంప్రకారం పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వైద్య విద్యనభ్యసించే విద్యార్థులు ఇలాంటి అకృత్యాలకు పాల్పడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పట్టపగలు దొంగల బీభత్సం.. ఏం ఎత్తుకెళ్లారో తెలిస్తే షాక్

టాలీవుడ్‌లో నెం.1 హీరోయిన్ కుర్చీ ఖాళీ: టాప్ స్థానం ఎవరిది

Mega 158: చిరంజీవి తేల్చేసారు.. ముహూర్తం అప్పుడే

టాలీవుడ్‌లో ఊహించని కాంబినేషన్స్.. అదిరిపోతున్న క్రేజ్

టాలీవుడ్‌లో పర్సెంటేజ్ యుద్ధం.. నిర్మాత-ఎగ్జిబిటర్ల మధ్య కొత్త వివాదం

Follow Us