నేపాల్‌లో గుట్కా ఉమ్మిన భారతీయులు.. నీళ్లు పోసి కడిగించిన వీడియో వైరల్
నేపాల్‌లో భారత పర్యాటకులు కారులో గుట్కా ఉమ్మివేయగా, ఓ స్థానిక వ్యక్తి వారిని ఆపి శుభ్రం చేయమని డిమాండ్ చేశాడు. పర్యాటకులు క్షమాపణలు చెప్పినా ఒప్పుకోక, వారిచే ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయించాడు. ఈ వీడియో వైరల్ కావడంతో ఆన్‌లైన్‌లో పెద్ద చర్చ మొదలైంది. కొందరు నేపాలీ వ్యక్తిని ప్రశంసించగా, మరికొందరు అతడి పద్ధతిని, భారత్ పట్ల ద్వేషాన్ని విమర్శించారు.
నేపాల్‌లో భారత పర్యాటకుల బృందానికి ఊహించని అనుభవం ఎదురైంది. నేపాల్ పర్యటనకు వెళ్లిన కొందరు భారతీయులు అక్కడ కారులో వెళుతూ గుట్కా నమిలి రోడ్డుపై ఉమ్మేశారు. దానిని ఓ వ్యక్తి గమనించి వారి వాహనాన్ని ఆపి వారిని నిలదీశాడు. వెంటనే వారి కారును ఆపి ‘ఇది ఇండియా కాదు సోదరా.. నేపాల్. త్వరగా నీళ్ళు పోయండి’ అని హిందీలో గట్టిగా హెచ్చరించాడు. దీంతో పర్యాటకులు ఇబ్బంది పడుతూ పలుమార్లు క్షమాపణలు చెప్పారు. అయినా ఆ వ్యక్తి శాంతించలేదు. “మీరు అంత పెద్ద దేశం నుంచి వచ్చి ఇక్కడ ఇలా చెత్త వేస్తున్నారు” అంటూ, కేవలం క్షమాపణ చెబితే సరిపోదని, ఆ మరకలను శుభ్రం చేయాలని డిమాండ్ చేసారు. దీంతో పర్యాటకులు నీళ్లు పోసి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేశారు. ఆ వీడియో ఆన్‌లైన్‌లో లక్షలాది వ్యూస్ సాధించడంతో నెటిజన్లు అభిప్రాయాలు తెలియ చేస్తున్నారు. పరిశుభ్రత విషయంలో చొరవ చూపిన ఆ నేపాలీ వ్యక్తిని కొందరు ప్రశంసించారు. మరికొందరు మాత్రం.. అతడు కఠినంగా వ్యవహరించాడని విమర్శించారు. ఒకరు చేసిన తప్పు వల్ల భారతదేశం మొత్తాన్ని నిందించడం సరికాదని హితవు పలికారు. ‘చాలా మంది నేపాలీలు మా దేశానికి వచ్చి, ఇక్కడ పనిచేసి, ఇక్కడే ఉంటారు. మేం వారిని గానీ, వారి దేశాన్ని గానీ అగౌరవపరచం. అవును.. ఆ పర్యాటకులు తప్పు చేశారు. వారు క్షమాపణలు చెబుతున్నా దేశం మొత్తాన్ని ఉద్దేశపూర్వకంగా నిందిస్తున్న తీరు స్పష్టంగా ద్వేషాన్ని చూపిస్తోంది. నేపాల్ దేశంలో అతిథులతో మీరు ప్రవర్తిస్తున్న తీరు చాలా విచారకరం’ అని ఒకరు కామెంట్ చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రేతాత్మ తిరుగుతోందంటూ కాలేజీలో పూజలు
Gold Price Today: ఆకాశాన్నంటుతున్న బంగారం,వెండి ధరలు
10 నిమిషాలు.. 100 బాంబులు.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు
రణ్‌బీర్ వర్సెస్ రణ్‌వీర్.. బాలీవుడ్‌లో బెస్ట్ ఎవరు
Peddi: పెద్దితో వారణాసి.. గట్టిగా వైరల్ అవుతున్న పెద్ది స్పెషల్ సాంగ్ న్యూస్
మద్యం షాపులోకి చొరబడి మద్యం తాగి మత్తుగా పొడుకున్న కోతి
కారు పైకప్పుపై పోలీస్.. 40 కి.మీ. ఛేజింగ్!
ఉదయాన్నే షాపు తెరుద్దామని వచ్చిన యజమాని.. సీన్ చూసి భయంతో పరుగు
ఆపదలో ఉన్న అన్నదాతకు అనంత్ అంబానీ సాయం
ఏఐ ఎంత పని చేసింది.. స్కూటర్‌పై వెళ్తున్న వ్యక్తికి భారీ చలాన్!
యూట్యూబర్ కొంపముంచిన రీల్స్.. ఏం జరిగిందో మీరే చూడండి!
అద్దంకిలో అద్భుతం.. బంగారు కాంతులు వెదజల్లిన శివలింగం!

