AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పట్టపగలు దొంగల బీభత్సం.. ఏం ఎత్తుకెళ్లారో తెలిస్తే షాక్

పట్టపగలు దొంగల బీభత్సం.. ఏం ఎత్తుకెళ్లారో తెలిస్తే షాక్

Phani CH
|

Updated on: Apr 11, 2026 | 6:02 PM

Share

ఖమ్మం జిల్లాలో జరిగిన ఓ వింత చోరీ స్థానికులను ఆశ్చర్యపరిచింది. పెనుబల్లిలోని ఓ మౌల్వీ ఇంట్లో దొంగలు లక్షన్నర విలువైన బంగారం, రూ.10 వేల నగదుతో పాటు వంటింట్లోని ఉల్లిగడ్డలు, కందిపప్పు, వంటనూనె, గ్యాస్‌ సిలిండర్‌ను కూడా ఎత్తుకెళ్లారు. పగటిపూట జరిగిన ఈ దోపిడీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

దొంగలు సాధారణంగా బంగారం, వెండి, నగదు కోసం ఇళ్లలో దోపిడీలకు పాల్పడుతుంటారు. కానీ ఖమ్మం జిల్లాలో జరిగిన ఒక చోరీ ఇప్పుడు స్థానికులను విస్మయానికి గురిచేస్తోంది. దొంగలు కేవలం విలువైన వస్తువులే కాకుండా, వంటింట్లో ఉన్న నిత్యావసర వస్తువులను కూడా మూటగట్టుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది. పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామంలో హైవే పక్కనే ఉన్న మసీదులో కమాలుద్దీన్ మౌల్వీగా పనిచేస్తున్నారు. ఆయన కుటుంబం కూడా అక్కడే నివాసం ఉంటున్నారు. ఉదయం ఈ దంపతులు ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లిన సమయంలో ఇంటి తాళం పగులగొట్టి గుర్తు తెలియని దుండగులు పట్టపగలే చొరబడి చోరీ చేశారు. బీరువాలో దాచుకున్న లక్షా యాభైవేల విలువైన బంగారు ఆభరణాలు, 10 వేలు నగదు, వెండి అంభరణాలు అపహరించుకు పోయారు. అంతటితో ఆగకుండా వంటింట్లోని ఉల్లిగడ్డలు, కందిపప్పు, వంటనూనె, గ్యాస్‌ సిలిండర్‌ను ఎత్తుకెళ్లిపోయారు. మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చిన దంపతులు, ఇంట్లో సామాన్లన్నీ చిందరవందరగా ఉండటం చూసి షాక్‌కు గురయ్యారు. బంగారం పోయిందని బాధపడుతుంటే, వంటింట్లో ఉన్న పప్పు, ఉల్లిపాయలు కూడా మాయమవ్వడం చూసి గ్రామస్థులు ముక్కున వేలేసుకుంటున్నారు.బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. క్లూస్ టీమ్ సాయంతో నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టాలీవుడ్‌లో నెం.1 హీరోయిన్ కుర్చీ ఖాళీ: టాప్ స్థానం ఎవరిది

Mega 158: చిరంజీవి తేల్చేసారు.. ముహూర్తం అప్పుడే

టాలీవుడ్‌లో ఊహించని కాంబినేషన్స్.. అదిరిపోతున్న క్రేజ్

టాలీవుడ్‌లో పర్సెంటేజ్ యుద్ధం.. నిర్మాత-ఎగ్జిబిటర్ల మధ్య కొత్త వివాదం

Dhurandhar 2: అవుట్ స్టాండింగ్ అంటున్న సందీప్.. ఫిదా అయిపోయిన ప్రభాస్..

Follow Us