Flights: కేవలం రూ.3 వేలకే విమాన ప్రయాణం.! కొత్తగా 2 విమాన సర్వీసులు..

|

Nov 02, 2024 | 6:22 PM

విశాఖపట్నం టు విజయవాడ మధ్య కొత్తగా రెండు విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమాన సర్వీసును విశాఖ విమానాశ్రయంలో కేంద్ర పౌర విమానయానా శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు ప్రారంభించారు. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌, ఇండిగో సంస్థలు ఈ రూట్లలో ప్రతి రోజు రెండు ట్రిప్‌లు నడపుతాయి. దీంతో విశాఖ టు విజయవాడ మధ్య ఫ్లైట్ కనెక్టివిటీ పెరుగుతుంది.

రాష్ట్రానికి వాణిజ్య రాజధానిగా ఉన్న విశాఖ.. మున్ముందు మరింత అభివృద్ధి చెందనున్న నగరం. విశాఖ అభివృద్ధికి ఇతర నగరాలతో కనెక్టవిటీ ఉండటం ఎంతో అవసరం. దీంతో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. మంత్రి రామ్మోహన్‌నాయుడు ఏం చెప్పారంటే.. విశాఖ-గోవా మధ్య విమాన సర్వీసులను సైతం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. భోగాపురంలో ఎయిర్‌పోర్ట్‌ నిర్మిస్తున్నామని, ఎయిర్ సర్వీస్ యూనివర్సిటీని అక్కడ నిర్మించేలా నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి రామ్మోహన్ తెలిపారు. ఎయిర్‌ సర్వీస్‌ యూనివర్శిటీ రాకతో మన విద్యార్థులు లాభపడనున్నారు. వారు బయటి రాష్ట్రాలకు వెళ్లకుండా సొంత రాష్ట్రంలో కోర్సులు పూర్తి చేసి ఉద్యోగాలలో స్థిరపడే అవకాశం ఉంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.