జూ నుంచి తప్పించుకున్న సింహం.. ఎప్పుడొచ్చి మీద పడుతుందో.. టెన్షన్‌.. టెన్షన్‌..

Updated on: Dec 11, 2025 | 1:41 PM

బంగ్లాదేశ్, పాకిస్తాన్ జూలలో సింహాలు తప్పించుకున్న ఘటనలు కలకలం రేపాయి. ఢాకా జూలో తలుపు సరిగా మూయకపోవడంతో ఆడ సింహం రెండున్నర గంటలు బయట ఉండి భయపెట్టగా, మత్తుమందు ఇచ్చి తిరిగి బోనులోకి చేర్చారు. లాహోర్‌లో సింహం బోను దాటి మహిళ, పిల్లలపై దాడి చేసి చివరికి కాల్చివేయబడింది. జూలలో భద్రతా లోపాలు, జంతువుల పర్యవేక్షణ ఎంత ముఖ్యమో ఈ సంఘటనలు నొక్కి చెబుతున్నాయి.

సాధారణంగా మనం జూలో సింహం ఉన్న బోను దగ్గరికి వెళ్లినప్పుడు అది చూసే చూపు మనల్ని మింగేస్తుందా అన్నట్లుగా ఉంటుంది. కొందరిని ఆ చూపే భయంతో వణికేలా చేస్తుంది బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో జూ నుంచి పారిపోయింది ఓ ఆడ సింహం. రెండున్నర గంటలపాటు అధికారులను హడలెత్తించింది. ఢాకాలోని మీర్పూర్‌ ప్రాంతంలోని జూలో ఉద్యోగిని గాయపరిచి ఎన్‌క్లోజర్‌ నుంచి సింహం తప్పించుకుంది. జంతువు తన ఎన్‌క్లోజర్ నుంచి బయటకు వచ్చిందని ఇతర ఉద్యోగులను హెచ్చరించి ఆ ప్రాంతం నుంచి బయటకు పరుగులు తీశాడు ఉద్యోగి. దీంతో సహాయక సిబ్బంది వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో అలర్టయిన అధికారులు జూ నుంచి సందర్శకులను ఖాళీచేయించారు. తప్పించుకున్న సింహం కోసం గాలించగా రెండున్నర గంటల తర్వాత ఓ పొదల్లో కనిపించింది. దీంతో మత్తు మందు ఇచ్చి దానిని బోనులోకి తరలించారు. అసిస్టెంట్ యానిమల్ కీపర్ మాట్లాడుతూ గదులను శుభ్రం చేస్తుండగా, తలుపులు సరిగా మూయకపోవడంతో ఎన్‌క్లోజర్ నుంచి తప్పించుకుందని ఒక ప్రకటనలో తెలిపారు. సింహమే జనవాసాల్లోకి వస్తే .. ఇంకేముంది రచ్చరచ్చే. అచ్చం అలాంటి ఘటనే ఇటీవల పాకిస్తాన్‌లో జరిగింది. లాహోర్‌లోని ఓ జూలో బోనులో ఉన్న సింహానికి ఆహారం వేస్తుండగా.. అది సిబ్బంది కళ్లుగప్పి బయటకు వచ్చేసింది. ఏకంగా గోడ దూకి రోడ్డుపైకి వచ్చి ఓ మహిళతో పాటు ఇద్దరు పిల్లలపై దాడి చేసింది. సింహాన్ని బంధించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నించినా లాభం లేకపోవడంతో చివరకు దానిని తపాకీతో కాల్చి చంపారు. సింహం గోడ దూకి బయటకు వచ్చిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రపంచంలోనే అత్యంత పొట్టి బర్రె మనదే.. గిన్నిస్‌లోకి 3 అడుగుల రాధ

విద్యార్థి ఇంటి ముందు ఉపాధ్యాయులు ధర్నా.. ఎందుకో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతది

ఆవు పాలు తాగి… ఆస్పత్రికి క్యూకట్టిన జనం.. ఏం జరిగిందంటే

ఇస్రో యువ శాస్త్రవేత్తగా కోనసీమ కుర్రాడు

లంచగొండులకు తగిన గుణపాఠం.. వాళ్ళతో పోలుస్తూ.. వినూత్న ర్యాలీ