ప్రియురాలికి వజ్రాల కళ్లజోడు బుక్ చేసి.. అడ్డంగా బుక్కయిన రూ.13 వేల జీతగాడు !!
ఓ యువకుడు మహారాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. నెలకు రూ.13 వేల జీతం. కానీ, పని చేస్తున్న సంస్థ కళ్లుగప్పి అక్షరాలా రూ.21.6 కోట్లు దోచేశాడు. ఆ డబ్బుతో ఖరీదైన కార్లు, బైక్‌లు కొన్నాడు. అంతేకాకుండా ఖరీదైన ప్రాంతంలో తన ప్రియురాలి కోసం 4బీహెచ్‌కే ఫ్లాట్ కొనుగోలు చేసి గిఫ్ట్‌గా ఇచ్చాడు.
అసలు ఇదంతా ఎలా చేయగలిగాడు? హర్షల్ కుమార్ క్షీరసాగర్ అనే 23 ఏళ్ల యువకుడు ఛత్రపతి శంభాజినగర్‌లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. నకిలీ ఈ-మెయిల్ ఖాతాను తెరిచి.. సంస్థ బ్యాంక్ అకౌంట్‌లోని డబ్బును కాజేశాడు. జులై 1 నుంచి డిసెంబరు 7 మధ్య కాలంలో సుమారు రూ. 21.6 కోట్ల నగదును మొత్తం 13 బ్యాంక్ అకౌంట్లకు బదిలీ చేశాడు. బ్యాంకు ఖాతాను హ్యాక్ చేసేందుకు హర్షల్ పక్కా ప్రణాళిక ప్రకారం వ్యవహరించాడు. బ్యాంకు అకౌంట్‌కు లింక్ చేసిన ఈ మెయిల్ అడ్రస్‌ను పోలి ఉండేలా.. కేవలం ఒకేఒక్క అక్షరం తేడాతో కొత్త ఈ మెయిల్‌ను క్రియేట్ చేశాడు. ఆ తర్వాత మెయిల్ అడ్రస్‌లో చిన్న పొరపాటు ఉందని, అప్‌డేట్ చేయాలని కోరుతూ స్పోర్ట్స్ కాంప్లెక్స్ పాత లెటర్ హెడ్‌పై బ్యాంక్‌కు లేఖ రాశాడు. దీంతో అతడు కొత్తగా క్రియేట్ చేసిన ఈ-మెయిల్ బ్యాంక్ ఖాతాకు లింక్ అయింది. తనకు అవసరమైన ఓటీపీలు, లావాదేవీలకు సంబంధించిన ఇతర సమాచారం ఆ ఈ-మెయిల్ ద్వారా తెలుసుకునేవాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆవుకు సీమంతం.. ప్రత్యేక పూజలు, నైవేద్యాలు..
ఫ్రిజ్ వాడుతున్నారా ?? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి !!
గూగుల్ మ్యాప్‌ను గుడ్డిగా ఫాలో అయ్యారు.. చివరికి ఇలా ఇరుక్కుపోయారు