విమానంలో గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ.. కోపంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచి..

|

Jan 15, 2025 | 3:00 PM

ఇటీవల విమానాల్లో ప్రయాణికులు అభ్యంతరకరంగా ప్రవర్తిస్తూ తోటి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఇప్పుడు అలాంటిదే మరో ఘటన జరిగింది. జెట్‌ బ్లూ విమానం లో ఓ ప్రయాణికుడు తోటివారిని హడలెత్తించాడు. విమానం గాల్లో ఉండగానే అత్యవసర ద్వారాన్ని తెరిచేందుకు ప్రయత్నించాడు. అమెరికాలోని లారెన్స్‌ లోగాన్ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్యూర్టోరికోకు చెందిన మోరెల్స్‌ టెర్రోస్ అనే వ్యక్తి విమానంలో తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ప్రయాణిస్తున్నాడు. ఆ సమయంలో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. టెర్రోస్‌ ఆవేశంతో విమానం అత్యవసర ద్వారాన్ని తెరిచి దూకేందుకు యత్నించాడు. దీంతో ఒక్కసారిగా తోటి ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమై అతడిని అడ్డుకున్నారు. సమీపంలోని విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. విమాన సిబ్బంది ఫిర్యాదుతో మసాచుసెట్స్ పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆతర్వాత నిందితుడికి బెయిల్‌ లభించగా.. కోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది. విచారణ నిమిత్తం మసాచుసెట్స్‌కి తప్ప భవిష్యత్తులో మరే ప్రాంతానికి ప్రయాణించకూడదని పేర్కొంది. విమానంలో జరిగిన ఘటనపై ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్ అధికారులు విచారణ చేపట్టారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గూగుల్ మ్యాప్‌ని నమ్ముకుని వెళ్తే.. పోలీసులకు ఊహించని షాక్..

అరటి పండ్ల ఎగుమతికి ఏకంగా రైలునే వేశారు.. ఆ బనానా ట్రైన్ స్పెషల్ ఇదే

గొంతులో 22 కత్తులను దింపి గిన్నీస్‌ రికార్డు కొట్టాడు.. కానీ..

TOP 9 ET News: సంక్రాంతిని మడతెట్టిన వెంకీ | 2nd డే దిమ్మతిరిగే వసూళ్లు డాకు విశ్వరూపం