Bike Stunt Viral: ఏదో చెయ్యాలనుకుంటే.. ఇంకేదో అయ్యింది.. గర్ల్స్ బైక్‌ స్టంట్ వీడియో.

|

Mar 21, 2023 | 9:47 AM

రోడ్డుపై వెళ్తున్నప్పుడు అటు వాహనదారులు, ఇటు పాదచారులూ కూడా చాలా జాగ్రత్తగా వెళ్తుండాలి. మనం ఎంత జాగ్రత్తగా వెళ్లినా ప్రమాదం ఎటునుంచి వస్తుందో చెప్పలేం.

రోడ్డుపై వెళ్తున్నప్పుడు అటు వాహనదారులు, ఇటు పాదచారులూ కూడా చాలా జాగ్రత్తగా వెళ్తుండాలి. మనం ఎంత జాగ్రత్తగా వెళ్లినా ప్రమాదం ఎటునుంచి వస్తుందో చెప్పలేం. ఇటీవల సోషల్‌మీడియాలో పాపులర్‌ అయ్యేందుకు వాహనాలపై డేంజరస్‌ పీట్లు చేస్తున్నారు. దాంతో వాళ్లే కాకుండా ఇతరులను కూడా ప్రమాదాల్లో పడేస్తున్నారు. తాజాగా ఓ మహిళా డ్రైవర్‌ చేసిన డ్రైవింగ్ మాత్రం నెట్టింట నవ్వులు పూయిస్తోంది. దీంతో పాపా ఏంజెల్ అంటూ నెటిజన్లు ఆటపట్టిస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఇద్దరు అమ్మాయిలు బైక్‌పై వెళ్తున్నారు. బైక్‌ నడుపుతున్న అమ్మాయి బైక్‌ ముందు చక్కాన్ని పైకి లేపి స్టంట్‌ చేయబోయింది. యాక్సిలేటర్‌పై చెయ్యి వెయ్యగానే.. ఒక్కసారిగా బైక్ పైకి లేచింది. దాంతో అమ్మాయి బ్యాలెన్స్‌ చేయలేకపోయింది. దీంతో స్నేహితులిద్దరూ కింద పడిపోయారు. బైక్‌ నడిపే అమ్మాయి వెంటనే పైకిలేచి బైక్‌ను నిలబెట్టింది కానీ రెండో అమ్మాయికి స్వల్పంగా గాయపడినట్లే తెలుస్తోంది. అదృష్టవశాత్తూ వెనుక ఉన్న అమ్మాయి హెల్మెట్ ధరించడంతో.. పెద్ద ప్రమాదమేమీ జరగలేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోను 6 లక్షలమందికి పైగా లైక్‌ చేశారు. అంతేకాదు రకరకాల ఫన్నీ కామెంట్లతో హోరెత్తించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: ఎన్టీఆర్ తోపా..! రామ్ చరణ్ తోపా ..? డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్..
Viral Video: ఇది బైక్ కాదు పుష్పక విమానం.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..! వైరల్ వీడియో..
Vidya Balan: ఆ దర్శకుడు నన్ను రూమ్‌కు రమ్మన్నాడు.. విద్యాబాలన్‌. వీడియో

Follow us on