Tablets: మెడికల్ షాపు నుంచి తెచ్చిన ట్యాబ్లెట్‌లో పురుగులు.. ఆ టాబ్లెట్స్‌ వేసుకున్న గర్భిణీ..(వీడియో)

|

Oct 06, 2022 | 8:12 PM

ఓ మెడికల్ షాపు నుంచి తెచ్చిన జింకోవిట్ ట్యాబ్లెట్‌లో పురుగులు కనిపించటం కలకలం రేపింది. నారింజ రంగు మాత్రలో చిన్న నల్ల పురుగులు ఉన్నాయని ఓ మహిళ ఆరోపించింది.


పప్పులు, బియ్యం, కూరగాయల్లో పురుగులు రావటం సహాజం. కొన్ని సందర్భాల్లో వండిన ఆహార పదార్థాల్లోనూ పురుగులు కనిపిస్తుంటాయి. కొన్ని కొన్ని సార్లు దుకాణాల్లో కొనుగోలు చేసిన చాక్లెట్స్‌, బిస్కెట్స్‌లో పురుగులు కనిపించిన సంఘటనలు మనం చూశాం. కానీ, ఇది ఎంతటి నిర్లక్ష్యం..రోగులు వాడే మందుబిల్లల్లోనూ పురుగులు ప్రత్యక్షమైతే..వారి పరిస్థితి ఎంటి..? అవును.. ఓ మెడికల్ షాపు నుంచి తెచ్చిన మాత్రలో పురుగులు కనిపించాయి. అది గమనించిన బాధితులు అప్రమత్తతో ప్రమాదం తప్పింది. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం, కలబురిగి జిల్లాలో చోటు చేసుకుంది.ఓ మెడికల్ షాపు నుంచి తెచ్చిన జింకోవిట్ ట్యాబ్లెట్‌లో పురుగులు కనిపించటం కలకలం రేపింది. నారింజ రంగు మాత్రలో చిన్న నల్ల పురుగులు ఉన్నాయని ఓ మహిళ ఆరోపించింది. అంజలి అనే మహిళకు ఈ మాత్రలు అందాయి. అంజలి రెండు నెలల గర్భిణి. సెప్టెంబర్ 23న కలబుర్గిలోని సంజీవిని ప్రైవేట్ ఆస్పత్రిలో చెక్‌ చేయించుకుని, అక్కడే స్థానికంగా ఉన్న ఆస్పత్రిలోని మెడికల్ షాపులో మాత్రలు తెచ్చుకుంది. ప్రతి నెలా అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ,..అక్కడే మందులు తీసుకుంటున్నట్టుగా బాధితురాలు చెప్పింది. ఈ క్రమంలోనే ఇప్పుడు అదే షాపులో మందులు కొనుగోలు చేసినట్టుగా తెలిపింది. సగం నెలకు సరిపడా మెడిసిన్స్‌ కొన్నట్టుగా చెప్పింది. డైలీ ఆ మందులు వాడుతోంది. ఈక్రమంలో సెప్టెంబర్‌ 29న మరో మాత్ర వేసుకోడానికి తీసి చూడగా అందులో పురుగులు కనిపించాయి. మెడికల్ షాపులో అడిగితే అలాంటి మందులు మా దగ్గర లేవని, అవి మా దగ్గర కొన్నవి కాదంటూ సమాధానమిచ్చారు. మెడికల్ షాపు సిబ్బందిపై అంజలి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ మాత్రలను వేసుకుంటే ఆ గర్భిణీ పరిస్థితి ఏంటని వారు ప్రశ్నించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్‌ ఫ్రెండ్‌..

Russia bat: ముంచుకొస్తున్న మరో డేంజరస్‌ వైరస్‌.. రష్యాలో కనుగొన్న కొత్తరకం వైరస్.. ఎలా సోకుతుందంటే!

Follow us on