30 ఏళ్లనాటి పిండం.. ఇప్పుడు శిశువుగా జననం

Updated on: Aug 06, 2025 | 6:20 PM

క్రయోప్రిజరేషన్‌ ద్వారా 30 ఏళ్లపాటు భద్రపరిచిన ఓ పిండం ఇప్పుడు శిశువుగా ప్రాణం పోసుకున్నాడు. 1994 లో ఫ్రీజ్‌ చేసిన ఈ పిండం నుంచి విజయవంతంగా బిడ్డ జన్మించడం రీప్రొడక్టివ్‌ మిడిసిన్‌లో ఒక గొప్పమైలురాయిగా నిలిచింది. దీంతో ప్రపంచంలోనే ఓల్డెస్ట్‌ బేబీగా రికార్డుకెక్కాడు. దాదాపు 30 ఏళ్లపాటు శీతలీకరించిన ఒక పిండం ఇప్పుడు శిశువుగా పురుడుపోసుకుంది.

ఇది ప్రపంచ రికార్డు అని నిపుణులు చెబుతున్నారు. ఇంత దీర్ఘకాలం పాటు ఫ్రీజ్‌ చేసిన పిండం.. శిశువుగా మారిన ఘటనలు ఇప్పటివరకూ లేవని వివరించారు. అమెరికాలోని ఒహాయోకు చెందిన లిండ్సే, టిమ్‌ పియర్స్‌ జంటకు మగశిశువుగా ఈ పిండం జన్మించింది. ఇది సైన్స్‌ ఫిక్షన్ సినిమాలా ఉందని ఆ జంట సంభ్రమాశ్చర్యాలకు లోనైంది. వీరు సంతానం కోసం ఏడేళ్లు నిరీక్షించారు. వారి ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో.. లిండా ఆర్చర్డ్‌ అనే మహిళకు సంబంధించిన పిండాన్ని స్వీకరించాలని నిర్ణయించారు. సహజసిద్ధంగా సంతానం కలగకపోవడంతో 1994లో లిండా ఆర్చర్డ్‌.. ఐవీఎఫ్‌ విధానం ద్వారా సంతానం పొందాలనుకున్నారు. ఇందుకోసం వైద్యులు.. ఆమె అండాలు, ఆమె భర్త వీర్యకణాలతో ఫలదీకరణ చేయించి నాలుగు పిండాలను వృద్ధి చేశారు. ఇందులో ఒక పిండం ద్వారా లిండా ఆర్చర్డ్‌ ఆడ సంతానాన్ని పొందారు. మిగతా మూడు పిండాలను క్రయోప్రిజరేషన్‌ ద్వారా భద్రపరిచారు. ఆ తర్వాత భర్త నుంచి విడిపోయినప్పటికీ ఆ పిండాలను ఆర్చర్డ్‌ వదులుకోలేదు. వాటిని పరిశోధనకు లేదా గుర్తుతెలియని కుటుంబానికి దానమివ్వడం ఆమెకు ఇష్టంలేదు. పిండాలను భద్రపరిచేందుకు ఆమె.. ఏటా వేలాది డాలర్లను చెల్లించారు. తర్వాత ఒక క్రిస్టియన్‌ పిండ దత్తత కేంద్రం.. వాటి బాధ్యతను స్వీకరించింది. అమెరికాలోనే ఉండే వివాహిత, తెల్లజాతి క్రిస్టియన్‌ జంటకు ఆ పిండాలను ఇవ్వాలని ఆర్చర్డ్‌ నిర్దేశించారు. ఈ షరతులు లిండ్సే, టిమ్‌ జంటకు సరిపోలాయి. దీంతో రెండు పిండాలను లిండ్సే గర్భంలోకి ప్రవేశపెట్టారు. అందులో ఒకటి శిశువుగా వృద్ధి చెందింది. ఆర్చర్డ్‌కు ఇప్పుడు 62 ఏళ్లు. ఆమె కుమార్తెకు 30 ఏళ్లు. శిశువుగా మారిన తన పిండం ఫొటోను చూసి ఆర్చర్డ్‌ సంతోషం వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బిగ్‌ అలర్ట్‌.. ఇప్పుడే జాగ్రత్త పడకపోతే మూడిందే.. తరువాత ఎంత ఏడ్చినా ఉపయోగం లేదు..

గూగుల్ తీసిన నగ్న ఫోటో.. కోర్టుకెళ్తే రూ.10 లక్షల నష్ట పరిహారం

నడి రోడ్డుపై బుస్సుమన్న నాగ పాము.. చూసిన జనాలు పరుగో పరుగు

ఏం సినిమా రా బాబూ.. రూ. 17,400 కోట్ల కలెక్షన్స్.. దెబ్బకు ప్రపంచ బాక్సాఫీస్ షేక్

పన్ను చెల్లింపుదారులకు అదిరేపోయే శుభవార్త