ఆంటీ అని పిలిచినందుకు.. మేల్‌ నర్స్‌కు జరిమానా

Updated on: Apr 10, 2026 | 6:12 PM

లండన్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. భారత సంతతి మహిళను 'ఆంటీ' అని పిలిచినందుకు, NHS ఆమెకు ₹1.8 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఇది వయసు, లింగ వివక్ష కిందకు వస్తుందని కోర్టు పేర్కొంది. 'ఆంటీ' అని పిలవద్దని చెప్పినా వినకపోవడాన్ని మానసిక వేధింపులుగా పరిగణించారు. పనిప్రదేశంలో గౌరవం, వ్యక్తిగత హక్కుల ప్రాముఖ్యతను ఈ తీర్పు స్పష్టం చేసింది.

భారత సంతతి మహిళను ఆంటీ అని పిలిచినందుకు, ఆమెకు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది లండన్‌ కోర్టు. లండన్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్ NHSలో ఐడా అనే భారత సంతతి హెల్త్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ఆ కార్యాలయంలో ఘనా దేశానికి చెందిన చార్లెస్‌ అనే మేల్ నర్స్‌ పనిచేస్తున్నాడు. అయితే మేల్‌ నర్సు చార్లెస్‌ భారత సంతతి మహిళను ఆంటీ అంటూ పిలిచేవాడు. తరచూ అలా పిలుస్తూ మానసికంగా వేధింపులకు గురి చేసాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఐడా.. తనను చార్లెస్‌ అవమానించాడని, పరిహారం చెల్లించాలంటూ కోర్టును ఆశ్రయించింది. దీనిపై వాట్‌ఫోర్డ్ ట్రైబ్యునల్ జడ్జి ఆధ్వర్యంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం గత ఏడాది విచారణ జరిపింది. తాజాగా దీనిపై తీర్పు చెప్పింది. భారత సంతతి మహిళకు NHS 1.8 లక్షల రూపాయలు పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆంటీ అని పిలవడాన్ని తప్పుబట్టింది. అలా పిలవడాన్ని వయసు, లింగబేధం పరంగా వేధింపులుగా పరిగణించింది. ఆమె అలా పిలవొద్దని చాలా సార్లు చెప్పినప్పటికీ, మేల్‌ నర్స్‌ పట్టించుకోలేదని, ఆంటీ అని పిలిచి అక్కడి వాతావరణాన్ని పాడు చేసినట్లు కోర్టు అభిప్రాయపడింది. మేల్‌ నర్సు సొంత దేశమైన ఘనా సంస్కృతిలో ఆంటీ అని పిలవడం గౌరవమే అయినప్పటికీ, ఐడా దృష్టిలో అది ఇబ్బందికరమే అనీ, పైగా తనను అలా పిలవొద్దని చెప్పినా వినకుండా పిలిచినందుకు పరిహారం చెల్లించాలని NHSను ఆదేశించింది. ఈ ఘటన 2023 జూన్‌- సెప్టెంబర్ మధ్య జరిగింది

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నేపాల్‌లో గుట్కా ఉమ్మిన భారతీయులు.. నీళ్లు పోసి కడిగించిన వీడియో వైరల్‌

ప్రేతాత్మ తిరుగుతోందంటూ కాలేజీలో పూజలు

Gold Price Today: ఆకాశాన్నంటుతున్న బంగారం,వెండి ధరలు

10 నిమిషాలు.. 100 బాంబులు.. లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు

రణ్‌బీర్‌ వర్సెస్‌ రణ్‌వీర్‌.. బాలీవుడ్‌లో బెస్ట్ ఎవరు

Follow Us