ఆవాలతో అద్భుతం.. ఆకట్టుకుంటున్న మైక్రో ఆర్ట్
మనం బియ్యపు గింజపై పేర్లు రాయడం, చిత్రాలు వేయడం చూసాం. ఈయన మరో అడుగు ముందుకేసి రెండు మిల్లీ మీటర్ల సైజు ఉండే ఆవాల గింజపై ప్రకృతిని ఆవిష్కరించారు. మైక్రో ఆర్ట్ ద్వారా ఆవగింజపై వివిధ జంతువులు, చెట్ల బొమ్మలను చిత్రించారు. అంతేకాదు 3,650 ఆవగింజలను ఉపయోగించి
మనం బియ్యపు గింజపై పేర్లు రాయడం, చిత్రాలు వేయడం చూసాం. ఈయన మరో అడుగు ముందుకేసి రెండు మిల్లీ మీటర్ల సైజు ఉండే ఆవాల గింజపై ప్రకృతిని ఆవిష్కరించారు. మైక్రో ఆర్ట్ ద్వారా ఆవగింజపై వివిధ జంతువులు, చెట్ల బొమ్మలను చిత్రించారు. అంతేకాదు 3,650 ఆవగింజలను ఉపయోగించి డ్రాయింగ్ షీట్‌పై క్రమ పద్ధతిలో అతికిస్తూ పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను వివరిస్తూ వేసిన మైక్రో ఆర్ట్ చిత్రం అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా చిత్రకారుడు కోటేష్ స్పందిస్తూ.. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, అందరూ చెట్లను నాటి, వాటిని సంరక్షించాలని, తద్వారా పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలని కోరారు. అందుకే ప్రకృతినుంచి వచ్చిన ఆవగింజలతోనే చిత్రాన్ని ఆవిష్కరించానని, ఈ చిత్రాన్ని 7 గంటలపాటు నిర్విరామంగా శ్రమించి వేశానని తెలిపారు. తాను వేసే చిత్రం వినూత్నంగా ఉండటమే కాకుండా, సందేశాత్మకంగా, కళాత్మకం వుండాలనే ఉద్దేశంతో పర్యావరణ దినోత్సవ పురస్కరించుకొని ఈచిత్రాన్ని రూపొందించానన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

