అక్కోయ్.. ఫస్ట్ శాలరీనా పిచ్చ హ్యాపీగా ఉన్నట్టున్నావుగా

|

Oct 29, 2024 | 9:27 PM

కొత్తగా ఉద్యోగంలో చేరి, మొదటి శాలరీ అందుకున్నప్పుడు సంతోషం వేరే లెవల్‌ లో ఉంటుంది. ఇక తాను ఎవరిపైనా ఆధారపడే అవసరం లేదనీ, ఆ డబ్బుతో తన అవసరాలన్నీ తీరుతాయని ఆనందంలో తేలిపోతారు. బహుశా ఈ యువతి కూడా అలాగే మొదటి శాలరీ అందుకుందో ఏమో.. ఏటీఎంలో డబ్బులు డ్రా చేసి, ఆ డబ్బులు బయటకు రాగానే పిచ్చ హ్యాపీగా డాన్స్ చేసింది.

దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ యువతి ఏటీఎంలోకి వెళ్లి, మెషిన్‌లో కార్డు పెట్టి నగదు డ్రా చేయడానికి ప్రాసెస్‌ మొత్తం పూర్తిచేసింది. ఆ తర్వాత నగదు బయటకు వచ్చింది. అలా బయటకు వచ్చిన క్యాష్‌ను చూసి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోయింది ఆ యువతి. చేతులు అటూ ఇటూ ఊపుతూ డాన్స్‌ చేసింది. తర్వాత క్యాష్‌ తీసుకొని లెక్కపెట్టుకొని మళ్లీ డాన్స్‌చేసింది. అలా ఏటీఎం గదిలో పిచ్చి పిచ్చిగా డాన్స్‌ చేసింది. చివరిలో తనకు డబ్బులు ఇచ్చినందుకు గాను ఏటీఎంకు తలవంచి నమస్కారం చేసిమరీ అక్కడ్నుంచి వెళ్లింది. ఈ సీన్‌ మొత్తం అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్‌ అయింది. దీంతో ఈ వీడియో కాస్త ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఫస్ట్ శాలరీ అకౌంట్‌లో పడిందేమో అనికొందరు,వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటికే 4 లక్షల మందికి పైగా వీక్షించారు. 7 వేల మందికి పైగా లైక్‌చేశారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

డేజంర్‌ బెల్స్ మోగిస్తున్న డ్రై ఐ సిండ్రోమ్

ఓర్నీ.. అరచేతిని స్కాన్ చేసి పేమెంట్ !! చైనాలో కొత్త టెక్నాలజీ !!

తెలంగాణలో ఈసారి శీతాకాలం.. వణికిస్తుందా ?? ఉక్కపోస్తుందా ??

అమెరికాలో 170 ఏళ్లుగా మంగళవారమే.. ఎందుకు ఎన్నికలు జరుపుతున్నారు ??

ఒకే కుటుంబంలో 5 రోజుల్లో ఐదుగురిని కాటేసిన ఒకే పాము !!

 

Follow us on