ఏనుగుతో యువతి పరాచకాలు.. ఏం చేసిందో చూడండి

Updated on: May 06, 2023 | 9:19 PM

అరటి పండు అంటే మనుషులకే కాదు.. కొన్ని జంతువులకు కూడా చాలా ఇష్టం. అందులో మొదటి వరుసలో కోతులు ఉంటాయి. ఆ తరువాత మరీ ఎక్కువగా ఇష్టపడే జంతువు ఏనుగు. ఈ అరటిపళ్లు ఏనుగు కంటపడ్డాయో గెలలు గెలలు స్వాహా చేసేస్తాయి. అంత ఇష్టం వాటికి.

అరటి పండు అంటే మనుషులకే కాదు.. కొన్ని జంతువులకు కూడా చాలా ఇష్టం. అందులో మొదటి వరుసలో కోతులు ఉంటాయి. ఆ తరువాత మరీ ఎక్కువగా ఇష్టపడే జంతువు ఏనుగు. ఈ అరటిపళ్లు ఏనుగు కంటపడ్డాయో గెలలు గెలలు స్వాహా చేసేస్తాయి. అంత ఇష్టం వాటికి. అందుకే చాలా మంది ప్రజలు ఏనుగులకు అరటి పండ్లను ఆహారం అందిస్తుంటారు. వాటిని తిని అవి చాలా సంతోషిస్తాయి. అలా కాకుండా వాటి ఇష్టాన్ని వీక్‌నెస్‌గా తీసుకొని ఆడుకోవాలని చూస్తే… ఇదుగో ఇలాగే ఉంటుంది.. ఓ యువతి అటవీ ప్రాంతంలోకి వెళ్లింది. ఆమె చేతిలో అరటిపళ్ల గెల ఉంది. అక్క ఓ పెద్ద ఏనుగుకు అరటి పండు తినిపించడానికి ప్రయత్నించింది యువతి. ఆ క్రమంలో ఏనుగుతో కాస్త ఆడుకోవాలనుకుంది. కానీ, ఏనుగు ముందు ఆమె ఆటలు సాగలేదు. చివరకు ఏనుగు ఇచ్చిన షాక్‌కి బిత్తరపోయింది. ఆ ఏనుగుకి బాగా కాలింది.