అతడు కాదు.. ఆమె.. 37 ఏళ్లుగా రహస్య జీవనం.. ఎందుకలా చేసిందో తెలిస్తే..?
తమిళనాడులోని కటునాయకన్‌పట్టిలో ముత్తులక్ష్మి అనే 57 ఏళ్ల మహిళ తన కూతురిని పోషించుకునేందుకు 37 ఏళ్లుగా పురుషుడిగా జీవించింది. భర్త మరణానంతరం వేధింపుల నుంచి తప్పించుకునేందుకు ముత్తు మాస్టర్గా మారి, కఠినమైన పనులు చేసింది. వృద్ధాప్య సమస్యలతో వితంతు పెన్షన్ కోసం నిజమైన గుర్తింపు వెల్లడించగా, అధికారిక అడ్డంకులు ఎదుర్కొంటున్నది.
తమిళనాడులోని కటునాయకన్‌పట్టి గ్రామానికి చెందిన ముత్తులక్ష్మి (57) అనే మహిళ తన కూతురి భవిష్యత్తు కోసం 37 ఏళ్లపాటు పురుషుడిలా జీవించి, సమాజానికి ఒక ఆశ్చర్యకరమైన కథను తెలియజేసింది. 20 ఏళ్ల వయసులో భర్తను కోల్పోయి, గర్భవతిగా ఉన్న సమయంలో ఒక ట్రక్ డ్రైవర్ వేధింపులకు గురి చేయడంతో ఆమె జీవితం మలుపు తిరిగింది. ఆ భయంకరమైన అనుభవం నుంచి తేరుకున్న తర్వాత, తన బిడ్డను ఒంటరిగా పెంచేందుకు, సమాజంలో రక్షణ పొందేందుకు ముత్తులక్ష్మి తన గుర్తింపును మార్చుకుంది.
మరిన్ని వీడియోల కోసం :
నిద్రలేని రాత్రులు గడిపానన్న విజయ్… మెగాస్టార్‌కి ఊరట!
సందీప్‌ని గుర్తుచేసిన గీతూ…అంతకు మించి అంటున్న ఆడియన్స్
పండగపూట భగ్గుమంటున్న చికెన్, మటన్ ధరలు
