నిద్రమత్తులో రైల్లోంచి జారిపడ్డ భార్య !! కాపాడబోయిన భర్త.. చివరికి ??

|

Jul 16, 2024 | 2:00 PM

రైలు నుంచి జారిపడ్డ తన భార్యను కాపాడబోయిన ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. నంద్యాల జిల్లా డోన్ సమీపంలోని ఎర్రగుంట్ల వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగీలో సయ్యద్ ఆసిఫ్, ఆయన భార్య ఆసియాబాను ఫుట్‌బోర్డుపై కూర్చుని ప్రయాణించారు. రైలు ఎర్రగుంట్ల మీదుగా వెళుతున్న సమయంలో నిద్రమత్తులో ఉన్న ఆసియాబాను రైలు నుంచి జారి కిందపడింది.

రైలు నుంచి జారిపడ్డ తన భార్యను కాపాడబోయిన ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. నంద్యాల జిల్లా డోన్ సమీపంలోని ఎర్రగుంట్ల వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగీలో సయ్యద్ ఆసిఫ్, ఆయన భార్య ఆసియాబాను ఫుట్‌బోర్డుపై కూర్చుని ప్రయాణించారు. రైలు ఎర్రగుంట్ల మీదుగా వెళుతున్న సమయంలో నిద్రమత్తులో ఉన్న ఆసియాబాను రైలు నుంచి జారి కిందపడింది. ఇది గమనించిన వెంటనే భార్యను కాపాడేందుకు రైలు నుంచి దూకిన ఆసిఫ్ మృతిచెందాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన మహిళను చికిత్స నిమిత్తం డోన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితులను కర్ణాటక రాష్ట్రం ఉడిపి జిల్లా చిరూరు ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. నాలుగు నెలల క్రితమే ఆ జంట ప్రేమ వివాహం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. గుంటూరు నుంచి బెంగళూరుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మహిళలు ప్రతిరోజూ బీట్‌రూట్ జ్యూస్‌ తాగితే ఏమవుతుందో తెలుసా ??

10 ఉద్యోగాలకు పోటెత్తిన 1800 ఆశావాహులు

నిద్రపోదామని మంచంపై వాలిన రైతు.. ఎదురుగా సెల్ఫ్‌లో ఉన్నది చూసి షాక్‌

పులసల సీజన్‌ షురూ.. మొదటి పులసను పట్టేశారుగా

మేడపై ఆవు ప్రత్యక్షం.. ఆశ్చర్యంలో స్థానికులు

Published on: Jul 16, 2024 10:39 AM