Cat Rabies: పిల్లి కరిచి రేబిస్ బారిన పడిన మహిళ మృతి.! ఐదు డోసులకి బదులు ఒకటే..

|

Aug 12, 2024 | 5:21 PM

కర్నాటకలో ఇంట్లో పెంచుకుంటున్న పిల్లి కరవడంతో రేబిస్‌ వ్యాధి బారిన పడి మహిళ మరణించింది. శివమొగ్గ జిల్లాలోని శికారిపుర తాలూకా తరలఘట్ట గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన 44 ఏళ్ల గృహిణి గంగీబాయి రెండు నెలల క్రితం ఇంట్లో చూసుకోకుండా పిల్లి తోకపై కాలు వేసింది. అప్పుడు పిల్లి ఆమె కాలుపై కరిస్తే, ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందింది.

కర్నాటకలో ఇంట్లో పెంచుకుంటున్న పిల్లి కరవడంతో రేబిస్‌ వ్యాధి బారిన పడి మహిళ మరణించింది. శివమొగ్గ జిల్లాలోని శికారిపుర తాలూకా తరలఘట్ట గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన 44 ఏళ్ల గృహిణి గంగీబాయి రెండు నెలల క్రితం ఇంట్లో చూసుకోకుండా పిల్లి తోకపై కాలు వేసింది. అప్పుడు పిల్లి ఆమె కాలుపై కరిస్తే, ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందింది. రేబిస్‌ సోకుండా ముందు జాగ్రత్తగా ఐదు ఇంజెక్షన్లు తీసుకోవాల్సి ఉండగా ఒక ఇంజెక్షన్‌ను మాత్రమే తీసుకుని ఏమీ కాదులే అని ఊరుకుంది. పది రోజుల క్రితం ఆమె ఉన్నపళంగా అనారోగ్యం బారిన పడటంతో శికారిపుర తాలూకా ఆస్పత్రిలో, ఆపై శివమొగ్గలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ గురువారం మృత్యువాత పడినట్లు జిల్లా సీజనల్‌ వ్యాధుల నియంత్రణాధికారి డాక్టర్‌ మల్లప్ప తెలిపారు.

పెంపుడు జంతువులు కరిచిన వెంటనే గాయాన్ని యాంటిబయాటిక్‌ ద్రవం, లేదా సబ్బుతోనైనా శుభ్రంగా కడగాలన్నారు. తరువాత సమీప ఆస్పత్రికి వెళ్లి నెల రోజుల్లో నాలుగు రేబిస్‌ ఇంజెక్షన్లను వేయించుకోవాలని, అప్పుడే రేబిస్‌ నుంచి తప్పించుకోవచ్చని తెలిపారు. పిల్లి, కుక్క వంటి జంతువుల కాట్లపై నిర్లక్ష్యం వద్దని ప్రజలకు సూచించారు. పెంపుడు జంతువైనా చాలా వరకు వీధుల్లో ఉండే ఇతర పిల్లులతో గొడవ పడుతుంటాయి. అలా ఇన్ఫెక్షన్‌కు గురైన పిల్లులు మనుషులను కొరికితే, వారికి ర్యాబిస్ సోకే ప్రమాదం ఉంది. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ CDC చెప్పిన దానిని బట్టి కుక్కలతో పాటు, పిల్లులలోనూ ర్యాబిస్ వైరస్​ ఉంటుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on