Viral: కూతురిపై ప్రేమ.. 667 టాటూలతొ గిన్సిస్ వరల్డ్ రికార్డ్ అంకితం చేసిన తండ్రి.
రికార్డ్ నమోదు కోసం కొంతమంది ఎవరూ చేయడానికి సాహసించని విన్యాసాలు చేస్తుంటారు. అయితే ఓ 49 ఏళ్ల వ్యక్తి తన కూతురి మీద ఉన్న ప్రేమను అనూహ్యంగా చాటుకున్నాడు. యూకేకి చెందిన మార్క్ ఓవెన్ ఇవాన్స్ ఏకంగా తన ముద్దుల కుమార్తె పేరును శరీరంపై 667 సార్లు టాటూలా వేయించుకుని గిన్నిస్ వల్డ్ రికార్డు సాధించాడు. ఇలా గిన్నిస్ లో తన పేరును నమోదు చేసుకోవడం ఇది రెండో సారికావడం విశేషం.
రికార్డ్ నమోదు కోసం కొంతమంది ఎవరూ చేయడానికి సాహసించని విన్యాసాలు చేస్తుంటారు. అయితే ఓ 49 ఏళ్ల వ్యక్తి తన కూతురి మీద ఉన్న ప్రేమను అనూహ్యంగా చాటుకున్నాడు. యూకేకి చెందిన మార్క్ ఓవెన్ ఇవాన్స్ ఏకంగా తన ముద్దుల కుమార్తె పేరును శరీరంపై 667 సార్లు టాటూలా వేయించుకుని గిన్నిస్ వల్డ్ రికార్డు సాధించాడు. ఇలా గిన్నిస్ లో తన పేరును నమోదు చేసుకోవడం ఇది రెండో సారికావడం విశేషం. అలా తన సొంత రికార్డును తానే అధిగమించాడు. 2017లో తొలిసారిగా తన కూతురు పేరును తన వీపుపై 267 సార్లు టాటూ వేయించుకుని రికార్డు సృష్టించాడు. కానీ 2020లో అమెరికన్ డైడ్రా విజిల్ తన పేరు మీద 300 సార్లు టాటూ వేయించుకోవడం ద్వారా రికార్డును బద్దలు కొట్టడంతో ఇవాన్స్ ఆ రికార్డును కోల్పోయాడు. తాజాగా ఇవాన్స్ తన కూతురి ‘లూసీ’ పేరును 667 టాటూలు వేయించుకుని తన రికార్డును తానే బ్రేక్ చేయడమేకాదు తమ తండ్రీకూతుళ్ల బంధం సాటిలేనిదని నిరూపించాడు ఇద్దరు టాటూ ఆర్టిస్టులు గంటల పాటు శ్రమించి మొత్తం భాగాన్ని పూర్తి చేశారు. ఒక్కో కాలుపై 200, మొత్తం 400 టాటూలతోపాటు ఈ మొత్తం టాటూలు పూర్తి కావడానికి ఐదున్నర గంటలు పట్టిందని ఇవాన్స్ మీడియాకు తెలిపారు. ఇది విచిత్రంగా ఉన్నా.. రికార్డును తిరిగి తన కుమార్తెకు అంకితం చేయడం సంతోషంగా ఉందంటూ ఆనందంతో పొంగిపోయాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..