చిమ్మ చీకట్లో వింత ఆకారాలు.. రాత్రి 8 దాటితే గజగజ వణుకుతున్న జనాలు
ఆ ప్రాంతంలో రాత్రి 8 దాటితే ప్రజలు బయటకు రావాలంటే వణికిపోతున్నారు. కంటిమీద కునుకు లేకుండా బిక్కుబిక్కు మంటూ రోజులు గడుపుతున్నారు. పగటిపూట పిల్లలను బయటకు పంపాలన్నా కూడా ధైర్యం చేయట్లేదు. ఇంతకూ వీళ్లు అంతలా భయపడుతున్నది దేనికో చూస్తే ఆశ్చర్యపోతారు. రాత్రి 8 దాటితే.. ఎవరూ భయటకు రావడం లేదు.
పిల్లలను బయటకు పంపడం లేదు.. రాత్రే కాదు ఉదయం పూట కూడా ఆ జంతువు సంచారంతో గజగజ వణికిపోతున్నారు. అది ఎప్పుడు.. ఎక్కడికి వస్తుందనే ఆందోళన చెందుతున్నారు.. కరీంనగర్ సిటి వేగంగా అభివృద్ధి చెందుతుంది.. నగర జనాభా పెరుగుతుంది.. శివారు కాలనీలు. ఇప్పుడు సెంటర్‌గా మారిపోయాయి. శాతవాహన యూనివర్సిటితో పాటు రేకుర్తి, విజయ పురికాలనీ, వికలాంగుల కాలనిలో.. ఎలుగు బంటి సంచారం కలకలం రేపుతోంది. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతాల్లో తిరుగుతున్న ఎలుగుబంటి స్ధానికులను భయబ్రాంతులకు గురిచేస్తోంది. స్థానికంగా 200 ఎకరాల్లో ఉన్న శాతవాహన యూనివర్సిటీ ప్రాంతంలో దట్టమైన చెట్ల పొదలతో పాటు చిన్న పాటి కొండలు ఉన్నాయి. అవే ఈ ఎలుగు బంట్లకు అవాసాలుగా మారాయి. దీంతో ఈ ఎలుగు తరచూ జనావాల్లోకి వస్తూ నగరవాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. తాజాగా రెండ్రోజుల క్రితం వికలాంగుల కాలనీలో ఎలుగుబంటి సంచరించింది. ఓ పాడుబడిన ఇంట్లో చొరబడి రెండు గంటలు అక్కడే తిష్టవేసింది. చివరకు అటవీశాఖ అధికారులు, పోలీసులు వచ్చి దాన్ని వెళ్లగొట్టే ప్రయత్నం చేయడంతో.. మెల్లగా అక్కడి నుంచీ జారుకుంది. అయితే ప్రస్తుతానికి అది అక్కడి నుంచి వెళ్లిపోయినా.. ఏదో సమయంలో మళ్లీ అది జనావాసాల్లోకి వస్తుందని స్థానికులు భయపడుతున్నారు. దీంతో ఎలుగు బంటిని బంధించి.. అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాలని స్థానికులు కోరుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బొజ్జ నొప్పితో బోరుమంటూ ఏడుస్తూ ఆస్పత్రికెళ్లిన మహిళ.. ఎక్స్‌రే చూసి డాక్టర్లు షాక్
పైసా జీతం లేకుండా 32 ఏళ్లుగా ట్రాఫిక్ డ్యూటీ.. అతని జీవితంలో ఆ విషాదం..?
రోజూ 8 గంటలు కదలకుండా కూర్చుంటున్నారా ?? అయితే ఈ వ్యాధులు మీకు దగ్గరపడుతున్నట్లే
నీటిని మరిగిస్తే బ్యాక్టీరియా చనిపోతుందా..? అధ్యయనంలో ఆశ్చర్యపోయే నిజాలు
కరోనా బాధితులకు ముందుగానే ముసలితనం.. సంచలనం రేపుతున్న లేటెస్ట్ అధ్యయనం