Magnetic Wi-Fi: పదో తరగతి విద్యార్థుల అద్భుతం…టీచర్‌ చెప్పిన పాఠంతో ప్రయోగం సక్కెస్‌..! (వీడియో)

వీళంతా సర్కారీ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు..! కానీ వీళ్లు చిన్నవయసులోనే అపారమైన మేదోశక్తిని పెంపొందించుకున్నారు. మట్టిలో ఉండే మాణిక్యాల కు కాస్త సాన బెట్టారు టీచర్లు. ఏకంగా అయస్కాంతం నుంచి వైఫై కనెక్షన్ సృష్టించి అందరినీ ఔరా అనిపించారు.

Magnetic Wi-Fi: పదో తరగతి విద్యార్థుల అద్భుతం...టీచర్‌ చెప్పిన పాఠంతో ప్రయోగం సక్కెస్‌..! (వీడియో)

|

Updated on: Nov 22, 2021 | 12:31 PM

వీళంతా సర్కారీ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు..! కానీ వీళ్లు చిన్నవయసులోనే అపారమైన మేదోశక్తిని పెంపొందించుకున్నారు. మట్టిలో ఉండే మాణిక్యాల కు కాస్త సాన బెట్టారు టీచర్లు. ఏకంగా అయస్కాంతం నుంచి వైఫై కనెక్షన్ సృష్టించి అందరినీ ఔరా అనిపించారు. ‘పట్టుదల ఉంటే కానిది లేదు’ అన్న సూక్తిని ఒంటబట్టించుకుని భావి శాస్త్రవేత్తలుగా ఎదుగుతున్నారు.

ఇది విశాఖ జిల్లా చోడవరం మండలంలోని లక్ష్మీపురం గ్రామం..ఇదే గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు పి.సాత్విక్‌, పి. గణేష్‌, పాతాళం వేణు పదో తరగతి చదువుతున్నారు..వీరు చేసిన ప్రయోగం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.ఈ ముగ్గురూ పదోతరగతి విద్యార్థులే.. కానీ, వైఫైని ఓ పట్టుపట్టారు. అయస్కాంతం, రెండు బ్లేడ్లు, ఛార్జింగ్‌ వైరుతో వైఫై సిగ్నల్‌ను రప్పించారు. భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు రామకృష్ణ రెండు రోజుల ముందు విద్యుదయస్కాంత తరంగాలతో అనేక రకాల ప్రయోగాలను చేయవచ్చనే పాఠాన్ని బోధించారు. ఇదే సాత్విక్‌లో ప్రేరణ కలిగించింది. తనకు వచ్చిన ఆలోచనలను తన స్నేహితులు గణేష్‌, వేణులతో పంచుకున్నాడు. ముగ్గురూ కలిసి పాఠశాలలోనే విద్యుదయస్కాంత తరంగాలతో సెల్‌ఫోన్‌కు వైఫై పనిచేసేలా ప్రయోగం చేశారు.రేడియోలు, టేపు రికార్డుల్లో స్పీకర్లకు ఉన్న అయస్కాంతంతో సెల్‌ఫోన్‌లో వైఫై పనిచేసేలా తయారు చేశారు. ఛార్జర్‌ అడాప్టర్‌ వైపు ఉన్న ప్లస్‌, మైనస్‌లో తీగలను అయస్కాంతంపై ఉన్న రెండు బ్లేడ్లకు పెట్టిన తర్వాత ఛార్జింగ్‌ పాయింట్‌ను సెల్‌ఫోన్‌కు అనుసంధానం చేస్తే వెంటనే వైఫై కనెక్ట్‌ అవుతుందని ఈ విద్యార్థులు చెబుతున్నారు.

విద్యుదయస్కాంత తరంగాలతో సెల్‌ఫోన్‌కు వైఫై పనిచేసేలా ప్రయోగం చేసిన ఈ భావి శాస్త్రవేత్తలను ఉపాధ్యాయులు అభినందిస్తున్నారు.చిన్న వయసులోనే తమ స్థాయిలో ఇలాంటి ప్రయోగంతో విజయం సాధించి చేసి హౌరా అనిపిస్తున్న ఈ సర్కారీ పాఠశాల విద్యార్థులకు.. కాస్త ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారనే దాంట్లో ఏ మాత్రం సందేహం లేదంటున్నారు ఇది తెలిసిన పలువురు.
మరిన్ని చూడండి ఇక్కడ:

Icon Star Allu Arjun Pushpa: సోషల్ మీడియాలో పుష్పరాజ్ సందడి.. ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్ పుష్ప లుక్స్..

jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..

Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

Follow us
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు