తెలంగాణలో టీవీ9 ఇంటర్వ్యూ రేపిన తుఫాన్‌! పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?

ఒకే ఒక్క లైవ్‌ షో... టీవీ9 చేసిన ప్రత్యక్షప్రసారం... మొత్తం తెలంగాణ పొలిటికల్‌ గ్రౌండ్‌ను కుదిపేస్తోంది. బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ చేసిన కామెంట్స్‌... రాజకీయంగా కొత్త చర్చకు దారితీశాయి. కాలేశ్వరం నుంచి లిక్కర్‌ దాకా... అప్పుల నుంచి ఫోన్‌ ట్యాపింగ్‌ దాకా... ఆయన ఇచ్చిన ఆన్సర్లకు..

తెలంగాణలో టీవీ9 ఇంటర్వ్యూ రేపిన తుఫాన్‌! పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?

|

Updated on: Apr 24, 2024 | 7:01 PM

ఒకే ఒక్క లైవ్‌ షో… టీవీ9 చేసిన ప్రత్యక్షప్రసారం… మొత్తం తెలంగాణ పొలిటికల్‌ గ్రౌండ్‌ను కుదిపేస్తోంది. బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ చేసిన కామెంట్స్‌… రాజకీయంగా కొత్త చర్చకు దారితీశాయి. కాలేశ్వరం నుంచి లిక్కర్‌ దాకా… అప్పుల నుంచి ఫోన్‌ ట్యాపింగ్‌ దాకా… ఆయన ఇచ్చిన ఆన్సర్లకు అవతలి వైపు నుంచి బౌన్సర్లు పడుతున్నాయి. దీంతో పొలిటికల్‌గా మరింత అగ్గి రాజుకుంది. మరోవైపు, రైతు రుణమాఫీ సహా గ్యారెంటీల అమలుపై పాలక, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం పతాకస్థాయికి చేరుకుంది. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌ మధ్య ఈ చాలెంజింగ్‌ ఎపిసోడ్‌ కంటిన్యూ అవుతోంది. ఇలా.. నేతలు సవాళ్లు, ప్రతిసవాళ్లతో చెలరేగిపోతుండటం… తెలంగాణలో రాజకీయ రణరంగాన్ని వేడెక్కిస్తోంది. పార్లమెంట్‌ ఎన్నికల ముంగిట ప్రస్తుత పొలిటికల్‌ సిట్యుయేషన్‌ ఎటు దారితీస్తుందోనన్న చర్చ ఎక్కువవుతోంది.

Follow us