Wife – Husband: భర్తను చంపి ఇంట్లోనే గుంత తవ్వి పూడ్చిపెట్టిన మాహాఇల్లాలు.. అంతటితో ఆగకుండా..
ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ పరిధిలో చంద్రవీర్, సవిత దంపతులు నివాసం ఉంటున్నారు. కొన్నేళ్ల క్రితం సవితకు అరుణ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.
ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ పరిధిలో చంద్రవీర్, సవిత దంపతులు నివాసం ఉంటున్నారు. కొన్నేళ్ల క్రితం సవితకు అరుణ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. విషయం తెలుసుకున్న చంద్రవీర్ భార్యను పద్ధతి మార్చుకోవాలని సూచించాడు. దీంతో ఇద్దరి మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను చంపేయాలని సవిత ప్లాన్ వేసింది. ప్రియుడు అరుణ్ తో కలిసి చంద్రవీర్‌ను తుపాకీతో కాల్చి చంపేసింది. అనంతరం మృతదేహాన్ని చంద్ర వీర్ ఇంట్లోనే పూడ్చారు. తర్వాత పైన సిమెంట్ ప్లోరింగ్ వేశారు. ఆ తర్వాత అదే ఇంట్లో ప్రియుడితో కలిసి కాపురం పెట్టింది. ఈ ఘటన 2018 లో జరిగింది.చంద్రవీర్ కనిపించకపోవడంతో స్థానికులు, కుటుంబ సభ్యులు అతని గురించి ఆరా తీశారు. దీంతో సవిత తన భర్తను బంధువులు కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. 2018 నుంచి ఈ కేసు పోలీసులకు మిస్టరీగా మారింది. అతని గురించి ఎలాంటి ఆచూకీ లభ్యం కాలేదు. తాజాగా లభించిన కొన్ని ఆధారాల ద్వారా లోతుగా దర్యాప్తు చేయగా ఈ షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. చంద్రవీర్ భార్య సవితపై అనుమానంతో ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో తాను తన ప్రియుడితో కలిసి చంద్రవీర్ ను హత్య చేసినట్లు సవిత అంగీకరించింది. దీంతో పోలీసులు వారిని జైలుకి తరలించారు. హత్యకు ఉపయోగించిన తుపాకీ, గొడ్డలిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..
తాత చేసిన పనితో.. అంతులేని సంపద మనవడి సొంతం..!
వామ్మో.. వీడి ట్యాలెంట్ చూసి పోలీసులే షాక్ అయ్యారు..!
మలంతో లక్షల సంపాదన.. ప్రాణాలు కాపాడుతున్న యువకుడు!
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్

